Begin typing your search above and press return to search.
జేఎన్టీయూలో బట్టలు లేకుండా పరుగెత్తించారు
By: Tupaki Desk | 30 Nov 2016 10:45 AM GMTర్యాగింగ్ భూతం మరోమారు పడగ విప్పింది. ఉన్నత విద్య కోసం వచ్చే వారు చెడు మార్గం పట్టకుండా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొందరు విద్యార్థుల్లో ఏ మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా హైదరాబాద్ లోని జేఏన్టీయూలో సీనియర్ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్ చేసే క్రమంలో తీవ్ర అమానుషంగా ప్రవర్తించారు. ఏకంగా కాలేజీ ప్రాంగణంలోనే బట్టలు లేకుండా పరిగెత్తించారు. దీంతో యూనివర్సిటీలో కలకలం రేగింది. తమకు జరిగిన అవమానంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జూనియర్లు ర్యాలీ తీశారు.
జేఎన్టీయూలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి అదే క్యాంపస్ లో హాస్టల్ లో సీనియర్లతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో తాజాగా జేఏన్టీయూలోని సదరు సీనియర్లు కొత్తగా కాలేజీలో చేరిన వారిని ర్యాగింగ్ చేయడం మొదలుపెట్టారు. వివిధ రూపాల్లో సాగిన ఈ ర్యాగింగ్ ఇటీవల తారా స్థాయికి చేరింది. విద్యార్థులను కాలేజీ ప్రాంగణంలో బట్టలు లేకుండా నగ్నంగా తిప్పారు. ఈ అవమానాన్ని భరించిన సదరు విద్యార్థి మరుసటి రోజు తోటి వారితో తమ ఆవేదనను పంచుకున్నారు. దీంతో అంతా కలిసి ఆందోళనకు సిద్ధమై జేఎన్టీయూ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ అనాగరిక చర్యను నిరసిస్తూ విద్యార్థి సంఘాలు సైతం ధర్నాలో పాలుపంచుకున్నాయి. ఈ పరిణామంలో షాక్ తిన్న అధికారులు సంబంధిత సీనియర్లపై చర్య తీసుకుంటామని ప్రకటించారు. దీంతో జూనియర్ విద్యార్థులు శాంతించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/