Begin typing your search above and press return to search.
అయ్యన్న ఎపిసోడ్ వెనుక టీడీపీ నేతలు..!
By: Tupaki Desk | 9 Nov 2022 7:30 AM GMTటీడీపీ నాయకుడు, సీనియర్ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారులపై ఏపీ ప్రభుత్వం కేసులు పెట్టిన విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా అయ్యన్న దూకుడు చూపుతున్న విషయం తెలిసిం దే. ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం, ముఖ్యమంత్రి జగన్‌ను ఆయన టార్గెట్ చేయడం తెలి సిందే. ఈ నేపథ్యంలో వాస్తవానికి అప్పట్లోనే ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే అయ్యన్న కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్తారు. మళ్లీ ఇప్పుడు తెరమీదకి వచ్చారు.
ఇంతలోనే ఆయన రెండు సెంట్ల స్థలాన్ని ఆక్రమించారంటూ.. కేసు పెట్టడం, అరెస్టు చేయడం.. తర్వాత కోర్టు ఆయనకుబెయిల్ ఇవ్వడం తెలిసిందే. అయితే.. ఇంత జరుగుతుంటే.. టీడీపీలో కొందరు నాయకు లు ఆయనకు అనుకూలంగా ఉంటే మరికొందరు మాత్రం వ్యతిరేకంగా ఉండడం గమనార్హం.వాస్తవానికి ఇప్పుడు అయ్యన్న పై కేసు నమోదు వెనుక టీడీపీలోని కొందరు నాయకులు ఉన్నారనే చర్చ ఆ పార్టీలోనే జరుగుతుండడం గమనార్హం. విశాఖ జిల్లాలో టీడీపీకి బలమైన వర్గం ఉంది.
అయితే.. తాజాగా అయ్యన్నపై కేసు నమోదైన తర్వాత.. ఆయనను పరామర్శించింది.. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నాయకులే కావడం గమనార్హం. ఒక్క వెలగపూడి తప్ప.. ఎవరూ విశాఖ నుంచి స్పందించ లేదు.
దీంతో అయ్యన్న అరెస్టు.. ఆయనపై కేసులు పెట్టడాన్ని కొందరు నాయకులు.. హ్యాపీగా ఫీలవుతు న్నారనే అంశం టీడీపీలో చర్చకు వచ్చింది. పైగా ఎక్కడో ఉన్న అయ్యన్న స్థలానికి సంబంధించి రెండు సెంట్ల భూమి ఆక్రమించారన్న విషయం గురించి అధికారులకు పట్టించుకునే తీరిక లేదు.
ఈ విషయం వారికి పెద్దగా కూడా తెలియదని అంటున్నారు. ఇదంతా కూడా టీడీపీలో ఉన్న కొందరు అయ్యన్న అంటే గిట్టని వారు.. ప్రభుత్వానికి ఉప్పందించి ఉంటారని.. వారి వల్లే అయ్యన్నపై కేసు నమోదై ఉంటుందనే చర్చ టీడీపీలో జరుగుతుండడం గమనార్హం. అంతేకాదు.
నిజంగా ప్రభుత్వం ఆయనపై కక్ష సాధించాలని అనుకుంటే ఎప్పుడో ఈ విషయంపై కేసులు పెట్టేదని అంటున్నారు. మొత్తానికి .. అయ్యన్న వ్యవహారంలో టీడీపీ నేతల పాత్ర ఉంటుందని సీనియర్లు అనుమానిస్తున్నారు. దీనిపై చంద్రబాబుకు వారు సమాచారంకూడా అందించారని.. తెలుస్తోంది. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.