Begin typing your search above and press return to search.
పెద్దావిడ ఎవరు? టీడీపీ ఫైర్ కి కారణమేంటి?
By: Tupaki Desk | 20 May 2020 1:10 PM GMTవృద్ధురాలిపై కేసు నమోదైన అంశంపై తెలుగుదేశం పార్టీ, అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రచ్చ సాగుతోంది. ఆరోపణలు.. ప్రత్యారోపణలు.. విమర్శలు.. ప్రతివిమర్శలు చేసుకుంటూ ఆ పెద్దావిడ అంశంపై రెండు పార్టీలు తీవ్రంగా దూషించుకుంటున్నాయి. అయితే ఆమెవరు? ఎందుకు టీడీపీ ఆగ్రహం చేస్తోంది? ఎందుకు ఇంతలా వివాదం రేపుతుఞదని ఆంధ్రప్రదేశ్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
విశాఖపట్నం శివారులో ఎల్ జీ పాలీమర్స్ దుర్ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదం నడుస్తోంది. ఈ సమయంలో గుంటూరు జిల్లాకు చెందిన రంగనాయకమ్మ స్పందించారు. తన ఫేస్ బుక్ లో ఓ పోస్టు చేశారు. ఆ పోస్టుతో అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందే సోషల్ మీడియాలో రూమర్లు, తప్పుడు వార్తలు, పోస్టంలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠినంగా ఉన్న విషయం తెలిసిందే. రంగనాయకమ్మ పెట్టిన పోస్టు భయాందోళనలు రేకెత్తేలా ఉందని అధికారులు గుర్తించారు. ఎల్ జీ పాలిమర్స్ కు సంబంధించిన సోషల్ మీడియాలో ఒక పోస్టు ఆమె చూశారు.
మళ్లీ లీకవుతున్న గ్యాస్.. సీఎం.. 150 + 2.. 22 ఎలా నిద్రపడుతోందయ్యా.. ఎక్స్ పర్ట్స్ ను పెట్టుకొని పని చేయించయ్యా అంటూ ఒక పోస్టు పెట్టారు. దీనికి సంబంధించి ఒక ఫోటోను పెట్టారు. అయితే.. ఈ పోస్టులో ఉన్న దాన్లో ‘మళ్లీ లీక్ అవుతున్న గ్యాస్’ అన్న క్యాప్షన్.. ప్రజల్లో భయాందోళనల్ని రేకెత్తించటం.. శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యతో పాటు.. ఇతర అంశాలు ఉంటాయని భావించి 66 ఏళ్ల రంగనాయకమ్మపై సీఐడీ కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించి ఆమె నోటీసు అందుకున్నారు.
దీంతో రచ్చ మొదలైంది. ప్రభుత్వాన్ని విమర్శిస్తే కేసులు బనాయిస్తారా అని టీడీపీ ప్రశ్నిస్తోంది. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పికొడుతున్నారు. ఇంతకీ ఈ రంగనాయకమ్మ ఎవరంటే. తెలుగు దేశం పార్టీ సానుభూతిపరురాలు. టీడీపీకి సంబంధించి యాక్టివ్ గా ఉండే వ్యక్తి.
అందుకే ఆ పార్టీ నాయకులు ప్రభుత్వంపై మండిపడుతుండగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిప్పికొడుతోంది. ఒక చిన్న పోస్టును సోషల్ మీడియాలో షేర్ చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయన్న విషయం ఈ సంఘటనతో అర్థమవుతోంది. మీరు కూడా అప్రమత్తంగా ఉండండి.