Begin typing your search above and press return to search.
మోదీ - జగన్ చేసిన పని ఎందుకు చేయవు కేసీఆర్?
By: Tupaki Desk | 24 Jun 2020 3:45 AM GMTఇప్పుడంతా కరోనా కలకలమే. సామాన్యుల నుంచి మాన్యుల దాకా, ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ మహమ్మారి సమయంలో రాజకీయాలు తెరమీదకు రావడం వింతే, కానీ చిత్రంగా అవే జరుగుతున్నాయి. తాజా పరిణామాలతో బీజేపీ రథసారథి, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ రథసారథి వైఎస్ జగన్ మధ్య పలువురు పోలికలు పెడుతున్నారు. కరోనా కట్టడి విషయంలో, చికిత్స విషయంలో ఈ ప్రస్తావన తెరమీదకు వస్తోంది.
కరోనాకు చికిత్స విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని ఇటీవలే ఆయుష్మాన్ భారత్ పథకం కింద చికిత్స పొందవచ్చని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం ద్వారా పలువురు లబ్ధి పొందుతూ చికిత్స చేయించుకుంటున్నారు. మరోవైపు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య శ్రీ కిందికి కోవిడ్‌ను తీసుకొచ్చారు. అంతే కాకుండా, కోవిడ్-19 పై సమీక్ష చేసిన వైఎస్ జగన్ 104 వాహనాల ద్వారా ప్రతి కుటుంబానికి పరీక్షలు చేయాలని సూచించారు. 90 రోజుల్లో కరోనా వైరస్‌పై సమగ్ర స్క్రీనింగ్ చేయాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. కోవిడ్ శాంపిల్స్ సేకరణతో పాటు బీపీ, షుగర్ కూడా చెక్ చేయాలని జగన్ పేర్కొన్నారు.
అయితే, అదే సమయంలో తెలంగాణలో తక్కువ పరీక్షలు చేస్తున్నారనే అపప్రదను తెలంగాణ సీఎం కేసీఆర్ ఎదుర్కుంటున్నారు. బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్‌లో కరోనాతో జనాలు పిట్టల్లా రాలుతున్నారని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. లాక్ డౌన్ సమయంలో నే టెస్టింగ్, ట్రేసింగ్ , ట్రీట్మెంట్ చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఎయిమ్స్ మాదిరిగా టిమ్స్ ను ఏర్పాటు చేశామని గొప్పగా ప్రకటించిన ప్రభుత్వం… నిర్వహణను మాత్రం గాలికి వదిలేసిందని ఆరోపించారు. శవాల ఆచూకి గల్లంతై గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు. కరోనా ను కేంద్రం ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి తెస్తే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆరోగ్య శ్రీలో చేర్చడం లేదన్నారు. ఆయుష్మాన్ భారత్ ను తెలంగాణలో అమలు చేయకుండా పేద ప్రజలను టీఆర్ఎస్ సర్కార్ దగా చేస్తోందని విమర్శించారు.