Begin typing your search above and press return to search.

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. జగన్ గెలుపు తెచ్చిన హ్యాపీ

By:  Tupaki Desk   |   1 Jun 2019 4:07 AM GMT
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. జగన్ గెలుపు తెచ్చిన హ్యాపీ
X
జగన్ గెలిచాడు. ప్రమాణ స్వీకారం కూడా పూర్తయ్యింది. ఏపీలో సంబరాలు కామన్.. తెలంగాణలోనూ సంబరాలు జరిగాయి. కానీ అందరికంటే ఎక్కువగా సీక్రెట్ గా ఆ నేతలు మాత్రం పండుగ చేసుకున్నారట.. మనోడు ఏపీ సీఎం అయినందుకు తెలంగాణలోని అన్ని పార్టీల నేతలు హ్యాపీగా ఉన్నారట.. ఇంతకీ జగన్ సీఎం అయితే వీళ్లెందుకు పండుగ చేసుకున్నారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న రోజులవీ.. కాంగ్రెస్ హయాంలో అంతా వారిదే రాజ్యం.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి మొదలు.. ఆయ మరణానంతరం కిరణ్ కుమార్ రెడ్డి.. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లోనూ వారిదే ఆధిపత్యం.. తరతరాలుగా ఉమ్మడి ఏపీలో ఆదిపత్యం చెలాయించిన ఆ సామాజికవర్గం 2014లో మాత్రం వెనుకబడి పోయింది. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత సామాజికవర్గ ఆదిపత్యం చేజారింది..

ఇటు తెలంగాణలో కేసీఆర్, అటు ఏపీలో చంద్రబాబు అధికారం చేపట్టడంతో తరతరాలుగా ఆధిపత్యం చెలాయించుకుంటూ వస్తున్న ఆ సామాజికవర్గ నేతలు హతాషులయ్యారు. అధికారం తమ పోటీ కులస్థులకు పోయిందేనని మథనపడ్డారట.. తమ వాళ్లకు అధికారం లేదే అని మథనపడ్డారు. ఇక 2018 డిసెంబర్ లో తెలంగాణలో అధికారానికి వచ్చి దూరం కావడంతో నిరాశపడ్డారు..

కానీ ఇప్పుడు ఏపీలో జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టడంతో వారంతా హ్యాపీగా ఉన్నారు. మనోడు గద్దెనెక్కాడని తెలంగాణలో సామాజికంగా బలంగా.. అధికంగా ఉన్న వాళ్లంతా పండుగ చేసుకున్నారట.. అయితే ఎటోచ్చి జగన్ మళ్లీ తమకు కొరకరాని కొయ్యగా మారిన కేసీఆర్ తో స్నేహగీతం ఆలపించడమే ఆ సామాజికవర్గ నేతలకు నచ్చలేదట.. ఏది ఏమైతేనేమీ..తమ సామాజికవర్గ నేత ఒక రాష్ట్రాన్ని పాలిస్తుండడం.. భవిష్యత్ లో తమకూ సహకరిస్తాడన్న భావన తెలంగాణ నేతల్లో వ్యక్తమవుతోందట..