Begin typing your search above and press return to search.
మూడు రాజధానుల బిల్లుకు లేటెందుకు....?
By: Tupaki Desk | 2 Sep 2022 2:30 AM GMTఏపీలో మరోసారి మూడు రాజధానుల అంశం చర్చలోకి వస్తోంది. సరిగ్గా ఇప్పటికి మూడేళ్ళ క్రితం మూడు రాజధానులు అంటూ వైసీపీ చలికాలంలో అతి పెద్ద మంట పెట్టింది. దాని మీద అనేక రకాలైన పోరాటాలు ఉద్యమాలు చెలరేగాయి. చివరికి మూడు రాజధానుల మీద ప్రభుత్వం చేసిన చట్టాన్ని ఉపసంహరించుకుంది. హై కోర్టు కూడా అమరావతి ఏకైక రాజధాని అంటూ తీర్పు చెప్పింది.
ఇలా కొన్ని నెలల క్రితం ఆగిన మూడు రాజధానుల కధ ఇపుడు మళ్ళీ మొదలవుతుందా అంటే అవును అనే అంటున్నారు. ఈ నెల మూడవ వారం నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయని అంటున్నారు. ఈ సమావేశాలలోనే మూడు రాజధానుల బిల్లుని ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది అంటున్నారు.
ఇప్పటికే జరగాల్సిన లేట్ జరిగింది ఇక ఎందుకు లేట్ మనది అదే రూట్ అని వైసీపీ పెద్దలు భావిస్తున్నారుట. ఈ నెల 7వ తేదీన జగన్ అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల తేదీని ఖరారు చేస్తారు. అదే టైమ్ లో మూడు రాజధానుల బిల్లు కూడా చర్చకు వస్తుంది అంటున్నారు. ఒక విధంగా మూడు రాజధానుల మీద బిల్లు సభలో ప్రవేశపెట్టడం ఖాయమనే అధికార పార్టీ నుంచి వినిపిస్తున్న మాటగా ఉంది.
మూడు రాజధానుల మీద వైసీపీ సర్కార్ చేసిన చట్టాన్ని రద్దు చేసుకున్నపుడు అంటే ఇప్పటికి పది నెలల క్రితం జగన్ నిండు సభలో ఒక మాట చెప్పారు. మళ్ళీ బిల్లుని సభలో ప్రవేశపెడతామనిల్ మరింత మెరుగైన తీరులో చట్టాన్ని తెస్తామనికూడా ఆయన సభకు చెప్పారు. అయితే ఆ తరువాత కొన్నళ్ళ పాటు వైసీపీ సైలెంట్ అయింది. ఇటీవల కాలంలో మళ్ళీ మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు మూడు రాజధానుల గురించి గట్టిగానే మాట్లాడుతున్నారు.
దాంతో మూడు రాజధానుల బిల్లు ఈసారి కచ్చితం అనే అంటున్నారు. ఇక ఈసారి అసెంబ్లీలో ఈ బిల్లుని కనుక ప్రవేశపెడితే సమావేశాలు పూర్తి హీటెక్కడం ఖాయం. అదే టైమ్ లో చంద్రబాబు సభకు వస్తారా రారా అన్న చర్చ కూడా ఉందిక్కడ. అధికార పార్టీ కనుక మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెడితే మాత్రం చంద్రబాబు తన ప్రతిజ్ఞను కూడా తీసి పక్కన పెట్టి సభకు హాజరవుతారు అని అంటున్నారు.
ఆయన సభకు హాజరుకాకపోతే వేరే సంకేతాలు వెళ్తాయని, పైగా అమరావతి రాజధాని సృష్టి కర్త అయిన చంద్రబాబు సభలో ఉండి మూడు రాజధానుల బిల్లుని అడ్డుకోకపోతే రాజకీయంగా కూడా ఇబ్బంది అవుతుంది అని తెలుగుదేశం భావిస్తోందిట. మొత్తానికి చంద్రబాబుని సభకు రప్పించేలా ఆయన మూడు మార్చేలా మూడు రాజధానుల బిల్లు ఉండబోతోంది అని అంటున్నారు. సో ఈసారి సమావేశాలు వెరీ హీట్ గురూ అనే అంటున్నారు. సో వెయిట్ చేయాల్సిందే మరి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.