Begin typing your search above and press return to search.
ఉక్రెయిన్లోనే డాక్టర్ కోర్సు ఎందుకు చేస్తున్నారో తెలుసా ?
By: Tupaki Desk | 26 Feb 2022 4:26 AM GMTమనదేశం నుండి ఉక్రెయిన్లో సుమారు 25 వేలమంది విద్యార్ధులు చదువుకుంటున్నారు. వీరిలో అత్యధికులు ఎంబీబీఎస్, ఎండీ చదువుతున్న వాళ్ళే. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలోనే ఉక్రెయిన్లో చదువుతున్న విద్యార్ధుల విషయాలు బయటకు వచ్చాయి. ఇపుడు యుద్ధం రాకపోతే ఉక్రెయిన్లో ఇన్ని వేలమంది భారతీయ విద్యార్ధులు చదువుకుంటున్నారని కూడా చాలామందికి తెలీదు.
మామూలుగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని అనుకునే విద్యార్ధుల చూపు అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాలపైనే ఉంటుంది. ఈమధ్య చైనాకు వెళ్ళి చదువుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. రష్యాకు వెళ్ళి చదువుకునే విద్యార్ధుల సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. అలాంటిది ఉక్రెయిన్ కే ఇంతమంది వెళ్ళి చదువుకుంటున్నారంటేనే ఆశ్చర్యంగా ఉంది. మనదేశంలో వాతావరణం వేరు ఉక్రెయిన్లో వాతావరణం వేరు. అయినా ఇంతమంది ఎందుకు వెళుతున్నట్లు ?
ఎందుకంటే ఎంబీబీఎస్ విద్య, ఎండీ విద్యకు అయ్యే ఖర్చు చాలా తక్కువ. ఇంటర్లో 50 శాతం మార్కులు తెచ్చుకుని, నీట్ పరీక్షలో అర్హత సాధించిన వాళ్ళు ఎవరైనా సరే ఉక్రెయిన్లో చదువుకోవచ్చు. ఆ దేశంలోని వివిధ నగరాల్లో ఉండే యూనివర్సిటీ కాలేజీలను బట్టి ఏడాదికి రు. 15 లక్షల నుండి 35 లక్షల్లో డాక్టర్ కోర్సు పూర్తయిపోతుంది. ఇదే డాక్టర్ కోర్సు మన రాష్ట్రంలో చేయాలంటే తక్కువలో తక్కువ రు. 70 లక్షలు ఖర్చవుతుంది. పైగా ఉక్రెయిన్లో డాక్టర్ చదువు చాలా నాణ్యమైనది.
డిమాండ్ తక్కువున్న కొన్ని కళాశాల్లో ఐదేళ్ళ కోర్సుకు రు. 15 లక్షలైతే బాగా డిమాండ్ ఎక్కువున్న కళాశాలలో కోర్సుకు రు. 35 లక్షలవుతుంది. పైగా మంచి జీవన ప్రమాణాలతో ఉండటానికి నెల ఖర్చు మన కరెన్సీలో ఒక్కోక్కరికి రు. 12-15 వేలు మాత్రమే. అదే నలుగురు కలిసి ఒక ఇంట్లో ఉంటే ఖర్చు ఇంకా తగ్గిపోతుంది. అంటే మధ్య తరగతి విద్యార్ధులకు కూడా కొంచెం కష్టపడితే ఉక్రెయిన్లో డాక్టర్ కోర్సు చదివేయచ్చు.
అందుకనే విజయవాడ, గుంటూరు లో 20 కన్సెల్టెన్సీలు పనిచేస్తున్నాయి. మంచి కన్సెల్టెన్సీని ఎంపిక చేసుకుంటే కాలేజీలో అడ్మిషన్, ఫీజులను డిసైడ్ చేయటం, గృహవసతి లాంటికి వాళ్ళే సాయం చేస్తారు. అందుకనే ఉక్రెయిన్లో ఎంబీబీఎస్ చదివే వాళ్ళే ఎక్కువ. ఉక్రెయిన్లో చదువుతున్న 25 వేలమందిలో 90 శాతం డాక్టర్ కోర్సు చదువుతున్న వాళ్ళే ఉన్నారంటేనే అర్ధమైపోతోంది అక్కడ చదువు ఎంత నాణ్యమైనది ? చవకైనదని.