Begin typing your search above and press return to search.

కేసీఆర్ 'ఫామ్ హౌస్ ఫైల్స్' వర్కవుట్ ఎందుకు కాలేదు?

By:  Tupaki Desk   |   5 Nov 2022 10:31 AM GMT
కేసీఆర్ ఫామ్ హౌస్ ఫైల్స్ వర్కవుట్ ఎందుకు కాలేదు?
X
తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు కోట్లాది రూపాయిలు 'ఎర' చూపించి బీజేపీ నేతలు బడా ప్లాన్ వేశారని.. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరిగింది తెలుసా? అంటూ గంట నిడివి ఉన్న వీడియో ఫుటేజ్ ను బయటకు వదిలారు టీఆర్ఎస్ అధినేత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.

ఫామ్ హౌస్ ఫైల్స్ గా ఫేమస్ అయిన ఈ వీడియోలు చూపించాల్సినంత ప్రభావాన్ని చూపించకపోవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మామూలుగా అయితే.. ఇలాంటి వీడియోలకు పెద్ద ఎత్తున మైలేజీ రావటంతో పాటు.. రాజకీయ రగడగా మారుతుంది. దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మీడియాలో పెద్ద ఎత్తున కవరేజ్ లభిస్తుంది.

కనీసం.. నాలుగైదు రోజుల పాటు రాజకీయాలు అట్టుడికిపోయే పరిస్థితి. అందుకు భిన్నంగా అలాంటిదేమీ లేని పరిస్థితి నెలకొనటం ఇప్పుడు షాకింగ్ గా మారింది. కేసీఆర్ వీడియో రిలీజ్ చేసినంతనే.. యావత్ దేశం దీని గురించి మాట్లాడుకుంటుందని.. జాతీయ రాజకీయాలు షేక్ అయిపోతాయని.. కేసీఆర్ పిలుపు ఇచ్చినంతనే పరిణామాలు వేగంగా మారిపోతాయన్న అంచనాలకు భిన్నంగా ఉండటం విస్మయానికి గురి చేస్తోంది. ఎందుకిలా? అంటే.. దానికి కారణం గంట పాటు నిడివి ఉన్న వీడియోలో పనికొచ్చే సరుకు ఏమీ లేకపోవటం ప్రధాన కారణం.

ఎవరైతే.. మాటలతో కోటలు దాటించారో.. వారెవరూ కూడా అమిత్ షా.. మోడీలతో ఉన్న సన్నిహిత సంబందాల్నిఫ్రూవ్ చేయలేకపోవటం. అన్నింటికి మించి.. ఎరవేసిన నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఎమ్ముల్యేలు టీఆర్ఎస్ నుంచి గెలిచిన వారు కాదు.

కాంగ్రెస్ బొమ్మ మీద గెలిచి.. అడ్డదారిలో టీఆర్ఎస్ లోకి వచ్చినోళ్లు. అలాంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఎమ్మెల్యేల్ని ఎర వేసి మరీ బీజేపీలోకి లాగాలని చూశారని.. అందుకోసం కోట్లాది రూపాయిలు కుమ్మరించేందుకు సిద్ధమయ్యారన్న మాటలు నమ్మబుద్ధిగా లేకపోవటం కూడా ఫాంహౌజ్ ఫైల్స్ తుస్ మనటానికి కారణమంటున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. కోట్లాది రూపాయిల బేరం నడుస్తున్నప్పుడు.. దానికి అడ్వాన్సుగా ఏమైనా పెద్ద మొత్తం దొరికి ఉంటే విషయం కాస్త సీరియస్ అయ్యేది. కానీ.. రూపాయి కూడా దొరక్కుండా.. డీల్ మాత్రం వందల కోట్లలో ఉండటం ఎందుకో నప్పలేదంటున్నారు. డబ్బులు రికవరీ చేయలేని వైనం బలహీనంగా మారింది. దీనికి తోడు సాక్ష్యాలు.. ఆధారాలు లభిస్తే కోర్టుకు ఇవ్వాలే కానీ.. వాటిని బయటకు ఇవ్వటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. ఇలాంటి కారణాలన్ని కలిపి కేసీఆర్ అనుకున్నంత బజ్ రాలేదంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.