Begin typing your search above and press return to search.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టారెందుకు?
By: Tupaki Desk | 6 Nov 2019 11:47 AM GMTరెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది హయత్ నగర్ మండలం పరిధిలోని అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ ను సజీవ దహనం వ్యవహారం. అయితే.. ఈ క్రైం వెనుక కోట్లాది రూపాయిలు విలువ చేసే భూముల వ్యవహారం ఉందని.. ఈ వివాదంలో అధికార పక్షానికి చెందిన నేతల ప్రమేయం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటివేళ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కమ్ టీఆర్ఎస్ నేత మంచిరెడ్డి కిషన్ రెడ్డి తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. తనపై వస్తున్న విమర్శలు.. ఆరోపణలపై వివరణ ఇస్తూ ఆయన తాజాగా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు.
మంచిరెడ్డి చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. తహసీల్దార్ విజయారెడ్డి హత్యోదంతంలో తనపై కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని.. ఈ నేపథ్యంలో ఒక ప్రజాప్రతినిధిగా జాగ్రత్తగా మాట్లాడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. విజయారెడ్డిని హత్యకు కారణమైన నిందితుడి బంధువుల వద్ద భూములు కొనుగోలు చేసిన వారే తనపై ఆరోపణలు చేశారన్నారు.
ఈ వివాదానికి కారణమైన 412 ఎకరాల భూమి సర్వే నంబర్లపై విచారణ చేయాలన్నారు. అసలు ఆ భూములు ఎవరెవరి పేరు మీద ఉన్నాయి? వారికి ఆ భూమి ఎలా వచ్చింది? ఎలాంటి డాక్యుమెంటేషన్ చేసుకున్నారు? లాంటి పలు ప్రశ్నలపై విచారణ జరపాలన్నారు.
ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాస్తున్నట్లుగా చెప్పిన మంచిరెడ్డి.. ఆ లేఖ ప్రతుల్ని సీఎస్.. డీజీపీలకు కూడా పంపుతున్నట్లు చెప్పారు. పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగుచూస్తాయని చెబుతున్నారు. ఏడాదిన్నరక్రితం 60 కుటుంబాల వారు తన వద్దకు వస్తే.. సదరు భూమికి సంబంధించి వ్యవహారాన్ని చూడాల్సిందిగా తానే జేసీ వద్దకు తీసుకెళ్లి న్యాయం చేయాలన్నారు. మంచిరెడ్డి ప్రెస్ మీట్ అయిపోయింది. మరి.. ఆయన కౌంటర్ పార్ట్ గా చెబుతున్న వారు ఈ విషయం మీద మరేం చెబుతారో చూడాలి.