Begin typing your search above and press return to search.

ఏపీ స్నేహితుడిని ట్రంప్ ఎందుకు మరిచాడు..ఆయనేమయ్యాడు

By:  Tupaki Desk   |   25 Feb 2020 8:30 PM GMT
ఏపీ స్నేహితుడిని ట్రంప్ ఎందుకు మరిచాడు..ఆయనేమయ్యాడు
X
ప్రస్తుతం దేశంలో అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ పర్యటిస్తున్నాడు... అయితే గతంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో ఓ పెద్ద మనిషి ట్రంప్ తన మిత్రుడు అని, ట్రంప్ తో తరచూ సమావేశాలు భేటీ అయి చర్చిస్తామని ఆయన ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆ సమయంలో తాను అమెరికాలోని ప్రజాప్రతినిధులు, సెనెటర్లు, గవర్నర్లు తెలిసినట్టు తెలపడంతో పాటు డొనల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు సహకరించిన అని చెప్పిన వ్యక్తి మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడని ఆంధ్రప్రదేశ్ లో చర్చ సాగుతోంది. ట్రంప్ గెలుపునకు పని చేశానని చెప్పిన వ్యక్తికి మరి ట్రంప్ పర్యటనలో ఎందుకు ఆహ్వానం లభించలేదని ప్రశ్నిస్తున్నారు. ఆయనే ప్రజాశాంతి పార్టీ అధినేత కిలారి ఆనంద్ పాల్. ఎవరో తెలియలేదా.. ఆయనే కేఏ పాల్.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో చాలా ఆసక్తికర పరిణామాలు జరిగాయి. ఆ సమయంలో హాస్యపు జల్లులు కురిపించిన వారిలో కేఏ పాల్ ముందుంటాడు. అమెరికాలో 2016లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ గెలుపునకు తాను సహకరించినట్లు తెలిపారు. అమెరికాలోని 50 మంది గవర్నర్లు, వంద మంది సెనేటర్లు, 650మంది ప్రతినిధులు తనకు తెలుసు ప్రకటించి అందర్నీ ఆశ్చర్య పరిచారు. అదే కాకుండా చాలా మతపెద్దలతో సమావేశమై సమాజ శాంతి కోసం కృషి చేసినట్లు చెప్పారు. తనను తాను గొప్ప మత ప్రబోధకుడిగా పేర్కొంటున్న కేఏ పాల్ తనకు అమెరికాలో ఎంతో ఫాలోయింగ్ ఉందని చెప్పాడు.

మరి అలాంటి వ్యక్తి ప్రస్తుతం దేశంలో డొనల్డ్ ట్రంప్ పర్యటన చేస్తుండగా మరి కేఏ పాల్ కు ఎందుకు ఆహ్వానం అందలేదని ఏపీలో ప్రశ్నలు మొదలయ్యాయి. అధ్యక్షుడి గా ట్రంప్ గెలుపునకు సహకరించిన వ్యక్తి అయితే కేఏ పాల్ కు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. అయితే సోమవారం జరిగిన అహ్మదాబాద్ బహిరంగ సభలో ఎందుకు కేఏ పాల్ ప్రస్తావన రాలేదని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మహాత్మా గాంధీ, సచిన్ టెండూల్కర్, కోహ్లీ తదితరులను ప్రస్తావించిన ట్రంప్ మరి తన గెలుపునకు కృషి చేశానని చెప్పిన కేఏ పాల్ ను మరచిపోయాడా? లేదా కేఏ పాల్ గురించి తెలియదా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కేఏ పాల్ కు అంత సీన్ లేదని ఎన్నికల సమయం లో ప్రజలు తేల్చేశారు. అందుకే ఆయన ఆంధ్రప్రదేశ్ లోని అన్ని స్థానాల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేసినా ఒక్కటంటే ఒక్క సీటు గెలుచుకోలేకపోగా.. ఆ పార్టీ ఉందని కూడా ప్రజలు గుర్తించలేదు. అలాంటి వ్యక్తి వార్తల్లో ప్రముఖం గా, టీవీల రేటింగ్ పెంచడానికి ఉపయోగపడే రాజకీయ హాస్య నటుడిగా పేరు పొందాడు.