Begin typing your search above and press return to search.
దాసోజు శ్రవణ్ ప్లేస్ ను శ్రీధర్ బాబుకు ఎందుకు ఇచ్చినట్లు?
By: Tupaki Desk | 7 May 2022 5:44 AM GMTఎంత మంచి వంటకమైనా సరే.. చిటికెడు ఉప్పు చేసే డ్యామేజ్ అంతా ఇంతా కాదు. ఉప్పు తక్కువైనా రుచి ఉండదు. అలా అని ఎక్కువ అయితే జరిగే నష్టం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలానే కీలక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు బోలెడన్ని ఉంటాయి. అన్నింటికి మించి.. ఒక రాజకీయ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరంగల్ లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభ విషయంలో అన్నీతానై అన్నట్లుగా వ్యవహరించిన వ్యవహారాన్ని నడిపారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
అలాంటి రేవంత్ చేయకూడని తప్పు చేశారంటున్నారు. రైతు సంఘర్షణ సభ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం. గడిచిన ఎనిమిదేళ్లుగా అధికారానికి దూరమై.. సమీప భవిష్యత్తులో అయినా అధికారంలోకి వస్తామా? రామా? అన్న సందేహాలతో కొట్టు మిట్టాడుతూ.. పెద్ద పర్వతంలా మారిన కేసీఆర్ ను ఎదుర్కొనే సత్తా తమకుందా? అన్న సందేహాల్లో మునిగిన నేతలతో పాటు క్యాడర్ లోనూ కొత్త జోష్ తీసుకురావటానికి వరంగల్ లో నిర్వహించిన తాజా సభ సాయం చేస్తుందని చెప్పాలి.
ఈ విషయాన్ని గుర్తించిన రేవంత్.. గడిచిన కొన్ని నెలలుగా ( మరింత స్పష్టంగా చెప్పాలంటే హుజూరాబాద్ ఉప ఎన్నిక నాటి నుంచి) రాజకీయంగా వెనుకబడి ఉన్న పార్టీని ముందుకుతీసుకెళ్లటంతో పాటు..కొత్త జోష్ ను నింపేందుకు వీలుగా తాజా బహిరంగ సభను నిర్వహించారు.
రాహుల్ వస్తున్న సభ కావటంతో భారీతనానికి ఏ మాత్రంతగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు..దాదాపు మూడు లక్షల మంది సభకు వచ్చేలా చేయటంలో సక్సెస్ అయ్యారు. నిప్పులు చెరిగే మే నెలలో ఇంత భారీ కార్యక్రమాన్నినిర్వహించటం అంత తేలికైన విషయం కాదు. దీనికి బోలెడంత కసరత్తు అవసరం. అన్ని బాగా కుదిరాయి.. సూపర్ అంటూ రేవంత్ రెడ్డికి ప్రశంసలు అదే వేళలో.. ఆయన తీసుకున్న ఒక నిర్ణయం ఆయన్ను వేలెత్తి చూపేలా చేయటమే కాదు.. విమర్శలకు అవకాశం ఇచ్చిందని చెప్పాలి.
రాహుల్ ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించేందుకు అస్థాన విద్వాంసుడైన దాసోజ్ శ్రవణ్ కు అప్పజెబుతారు. ప్రధాన వక్త మాట్లాడిన టెంపోను మొయింటైన్ చేయటమే కాదు.. మరికాస్త భావోద్వేగాన్ని పెంచే టాలెంట్ దాసోజు సొంతం. వరంగల్ సభలో రాహుల్ చేసిన ప్రసంగాన్ని దాసోజు శ్రవణ్ కానీ అనువదించి ఉంటే.. ఈ లెక్క వేరుగా ఉండేది. ఫలితం మరింత బాగుండేది. బ్యాడ్ లక్ ఏమంటే.. దాసోజు శ్రవణ్ కు బదులుగా మాజీ మంత్రి.. సీనియర్ నేత డి. శ్రీధర్ బాబుకు అప్పజెప్పటం మైనస్ గా మారిందని చెప్పాలి.
రాహుల్ స్పీచ్ ను ఆసక్తికరంగా.. ఆయన చెప్పిన విధానంలో ప్రజలకు చెప్పే విషయంలో శ్రీధర్ బాబు ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకున్న రేవంత్.. రాహుల్ ఇమేజ్ ను పెంచటంతో పాటు. పార్టీకి కొత్త ఊపు తీసుకొచ్చే ప్రసంగాన్ని తెలుగులో తర్జుమా చేసే బాధ్యతను దాసోజుకు ఇవ్వకుండా పెద్ద తప్పు చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. ఈ విషయంలో రేవంత్ ఎందుకు తప్పు చేశారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.