Begin typing your search above and press return to search.
శాశ్వతంగా ఎందుకు బ్యాన్ చేయలేదు ?
By: Tupaki Desk | 28 Sep 2022 4:56 AM GMTపాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)ని కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ళపాటు నిషేధం విధించింది. పీఎఫ్ఐ అనేది ముస్లిం భావజాలాన్ని వ్యాప్తి చేయటంతో పాటు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి అనేక కుట్రలు పన్నుతున్నట్లు నిఘా సంస్ధలు ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర హోంశాఖ నిషేధం నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటికే పీఎఫ్ఐ దేశానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆధారాలతో సహా నిర్ధారణైంది.
కొద్దిరోజులుగా పీఎఫ్ఐ కార్యాలయాలపై, కార్యక్రమాలతో పాటు నిర్వాహకుల కదలికలపై ఇంటెలిజెన్స్ వర్గాలు 24 గంటలూ నిఘా వేసింది. పీఎఫ్ఐకి సంబంధించిన అన్నీ వివరాలను సేకరించిన తర్వాతే చాలామందిని పోలీసులు అరెస్టులు చేశారు.
ఈ మధ్యనే ఎనిమిది రాష్ట్రాల్లో తెల్లవారుజామున ఏకకాలంలో దాడులు చేసి సుమారు 106 మందిని అరెస్టు చేశారు. మళ్ళీ మంగళవారం కూడా దేశంలోని అనేక ప్రాంతాల్లో మరో 170 మందిని అరెస్టు చేశారు.
పీఎఫ్ఐ సంస్ధలపై దాడులు చేసి బ్యాంకు ఎకౌంట్లను పరిశీలించినపుడు వందల కోట్ల రూపాయల లావాదేవీలు బయటపడ్డాయి. కోట్ల రూపాయల నిధులు రావడం, దేశంలోని కొన్ని వందల మందికి భారత్ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించేందుకు, దేశాన్ని విచ్చిన్నం చేసేందుకు భారీ ఎత్తున డబ్బులు ఖర్చు చేస్తున్న విషయం ఆధారాలతో సహా సంపాదించింది. ఇంత జరిగిన తర్వాత కూడా ఈ సంస్ధను కేవలం ఐదేళ్ళు మాత్రమే కేంద్రం ఎందుకు బ్యాన్ చేసింది ? ఇలాంటి సంస్ధలను శాశ్వతంగా ఎందుకు బ్యాన్ చేయటం లేదో అర్ధం కావటంలేదు.
పీఎఫ్ఐ గతంలో సిమి అనే పేరుతో తీవ్రవాద కార్యక్రమాలు నిర్వహించినట్లు నిఘావర్గాలు ఆధారాలను సేకరించాయి. అంతర్జాతీయంగా నిషేధం ఉన్న లష్కరే తోయిబా లాంటి తీవ్రవాద సంస్ధలతో పీఎఫ్ఐ బాగా సన్నిహిత సంబంధాలున్నాయని ఇప్పటికే ఆధారాలు బయటపడింది. దేశ విచ్ఛిన్నత కోసం ఎంతగా కృషిచేస్తున్న పీఎఫ్ఐపై శాశ్వత నిషేధం విధించటమే సరైన నిర్ణయం. లేకపోతే ఐదేళ్ళ తర్వాత మళ్ళీ తన కార్యక్రమాలను ప్రారంభించటం సంస్ధకు పెద్ద కష్టమేమీ కాదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.