Begin typing your search above and press return to search.
లోకేష్ ను ఎందుకు పక్కన పెట్టారు ?
By: Tupaki Desk | 5 Nov 2021 6:14 AM GMTచివరకు పార్టీలో నారా లోకేష్ పరిస్దితి ఇలాగ తయారైపోయింది. తొందరలో జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్+మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయానికి చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా ఇన్చార్జీలను నియమించారు. ఇందులో ఏ మున్సిపాలిటీకి గానీ ఏకైక నెల్లూరు కార్పొరేషన్ కు కానీ లోకేష్ ను ఇన్చార్జిగా నియమించలేదు. విచిత్రమేమిటంటే చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటి ఎన్నికలకు కూడా లోకేష్ ను దూరంగా పెట్టేశారు.
కుప్పం మున్సిపాలిటి బాధ్యతలను పాలకొల్లు ఎంఎల్ఏ నిమ్మల రామానాయుడుకు చంద్రబాబు అప్పగించటమే విచిత్రంగా ఉంది. అధికారంలో ఉన్నంతకాలం కుప్పంలో అధికార, పార్టీ వ్యవహారాలను చూసింది లోకేషే. నియోజకవర్గం బాధ్యతలను చంద్రబాబు పూర్తిగా కొడుక్కు వదిలేసిన కారణంగానే అక్కడ పార్టీ వ్యవస్ధ మొత్తం దెబ్బతినేసింది. ఎలాగంటే కుప్పం నుండి నేతలెవరు వచ్చినా లోకేష్ కలిసేవారు కాదు. ఫోన్ చేసినా స్పందిచింది చాలా తక్కువేనట.
ప్రభుత్వ వ్యవహారాలు మాట్లాడాలన్నా, పార్టీ విషయాలు చర్చించాలన్నా లోకేష్ అక్కడి నేతలకు సమయం కేటాయించింది చాలా తక్కువే. ఎందుకంటే మొత్తం వ్యవహారాలను కేవలం ఇద్దరు, ముగ్గురికి అప్పగించేసి లోకేష్ ఐదేళ్ళు కాలక్షేపం చేశారు. దాంతో చంద్రబాబుతో పాటు లోకేష్ మీద కూడా అక్కడి నేతల్లోనే కాకుండా జనాల్లో కూడా వ్యతిరేకత పెరిగిపోయింది. ఈ విషయాన్ని సరిగ్గా ఎన్నికలకు ముందు చంద్రబాబు భార్య భువనేశ్వరి గ్రహించి పగ్గాలను తన చేతుల్లోకి తీసుకున్నారు.
గడచిన 30 ఏళ్ళలో ఎప్పుడు లేనివిధంగా మొన్నటి ఎన్నికల్లో మొదటి రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపులో చంద్రబాబు వెనకబడ్డారు. దీంతోనే చంద్రబాబుపై జనాల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్ధమైపోయింది. అయితే ఈ విషయం చంద్రబాబు, లోకేష్ కు మాత్రం అర్ధంకాలేదు. మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఘోరఓటమి తర్వాత కుప్పంపై చంద్రబాబు దృష్టి పూర్తిగా తగ్గిపోయింది. దీనికితోడు కరోనా వైరస్ సమస్య కూడా తోడవ్వటంతో చంద్రబాబు నియోజకవర్గానికి దూరమైపోయారు.
ఇలాంటి అనేక కారణాల వల్లే పంచాయితి, స్ధానికసంస్ధల ఎన్నికల్లో పార్టీ దారుణంగా దెబ్బతిన్నది. ఇలాంటి పరిస్ధితుల్లోనే కుప్పం మున్సిపల్ ఎన్నికలు ముంచుకొచ్చాయి. ఇపుడు మళ్ళీ ఎన్నికల సందర్భంగా పిక్చర్లోకి తీసుకొస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో అన్న భయంతోనే లోకేష్ ను చంద్రబాబు పూర్తిగా దూరంగా పెట్టేసినట్లు అర్ధమవుతోంది. మరి రామానాయుడు ఆధ్వర్యంలో పార్టీ ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో చూడాల్సిందే.