Begin typing your search above and press return to search.
తారక్ ను ఎందుకు టార్గెట్ చేసినట్లు? మోడీషాల ఎంపిక వెనుక లెక్కేంటి?
By: Tupaki Desk | 22 Aug 2022 5:01 AM GMTరెండు తెలుగు రాష్ట్రాల్లోఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం.. బీజేపీ అగ్రనేతల్లో ఒకరు.. మోడీకి అత్యంత సన్నిహితుడు అమిత్ షా తన తెలంగాణ పర్యటనలో జూనియర్ ఎన్టీఆర్ అలియాస్ తారక్ తోనే ఎందుకు భేటీ అయ్యారు. దాని వెనుక అంశాలు ఏమిటన్నదానిపై పెద్ద ఎత్తున ఆసక్తి వ్యక్తమవుతోంది. అటు బీజేపీనేతలు కానీ ఇటు తారక్ సన్నిహితులు కానీ ఎవరూ కూడా దీనికి సంబంధించిన వివరాల్ని బయటకు వెల్లడించటం లేదు. అదే సమయంలో.. అమిత్ షా భేటీ వేళ కొన్ని అంశాలు బయటకు రావటం తెలిసిందే.
ఇలాంటివి కొన్నింటిని పరిగణలోకి తీసుకొని.. కొందరు రాజకీయ నేతలు వేసిన లెక్కల్ని చూసినప్పుడు ఈ భేటీకి సంబంధించిన కొత్త కోణం ఒకటి బయటకు వస్తోంది. టాలీవుడ్ లో ఎంతోమంది ఉన్నప్పటికీ.. జల్లెడ వేసి మరీ తారక్ ను ఎందుకు ఎంపిక చేసినట్లు? అన్నది ప్రశ్నగా మారింది. తారక్ ఎంపికలో ఆయన తాజా మూవీ ఆర్ఆర్ఆర్ అని చెబుతున్నారు. ఇందులో గోండ్ల నాయకుడు కొమరం భీం పేరుతో ఉన్న పాత్రను పోషించటం తెలిసిందే.
నిజానికి ఒరిజినల్ కొమొరం భీంకు.. ఆర్ఆర్ఆర్ లో తారక్ నటించిన పాత్రకు ఎలాంటి పోలిక లేదు. కేవలం.. ఆయన సాహసాన్ని.. వీరత్వాన్ని స్ఫూర్తిగా తీసుకోవటంతో పాటు తెలంగాణ ప్రజలు అమితంగా ఆరాధించే ఆయన పేరుతో పాత్రను డిజైన్ చేశారని చెప్పాలి.
కొమొరం భీం పాత్రలో ఎన్టీఆర్ ఒదిగిపోవటమే కాదు.. తెలంగాణ వరకు చూస్తే.. ఆయన్ను అమితంగా ఆరాధించటం తెలిసిందే. ఏపీ విషయాన్ని పక్కన పెడితే తెలంగాణలో మాత్రం చాలామంది తారక్ పాత్రకు కనెక్టు కావటమే కాదు.. ఆయన అద్భుతంగా నటించిన వైనానికి ఫిదా అయ్యారు. అప్పటివరకు తారక్ ను వేరే కోణంలో చూసిన తెలంగాణవాదులు సైతం ఆయన్ను అభిమానించటం.. తమ వాడిగా భావించటం మొదలైనట్లుగా చెబుతారు. ఈ విషయాల్ని గుర్తించిన బీజేపీ అధినాయకత్వం.. తెలంగాణ ప్రజల్ని కనెక్టు చేసేందుకు ఉన్న మార్గాల్లో ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్నట్లు చెబుతున్నారు.
ఇక.. తెలంగాణ అధికారపక్షానికి జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య సన్నిహిత సంబంధాలు ఏమీ లేవు. హాయ్ అంటే హాయ్ అనేంత మాత్రమే ఉన్నాయి. ఇలాంటివేళలో.. తారక్ ను తమ వాడిగా ప్రొజెక్టు చేసేందుకు వీలుగా మోడీషాల ప్లానింగ్ చేసి ఉంటారని చెబుతున్నారు.
టాలీవుడ్ మొత్తంలో జూనియర్ ఎన్టీఆర్ కున్న విలక్షణత.. ఏపీ మూలాలు ఉండి తెలంగాణ వాదులు సైతం అంగీకరించే అతి కొద్ది మంది అగ్రహీరోల్లో ఒకరైన తారక్ ను గుర్తించటం ద్వారా తమకు మైలేజీ వస్తుందన్న ఆలోచనతోనే ఆదివారం పొద్దుపోయిన తర్వాత ప్రత్యేకంగా భేటీ అయినట్లుగా భావిస్తున్నారు.