Begin typing your search above and press return to search.

200 మంది అభ్య‌ర్థులు హాజ‌రైన మీటింగ్ కు జ‌గ‌న్ రాలేదెందుకు?

By:  Tupaki Desk   |   16 May 2019 10:46 AM GMT
200 మంది అభ్య‌ర్థులు హాజ‌రైన మీటింగ్ కు జ‌గ‌న్ రాలేదెందుకు?
X
ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎలా ఉండాలి? అన్న ప్ర‌శ్న రెండు తెలుగు రాష్ట్రాల్లో త‌ర‌చూ వినిపిస్తూ ఉంటుంది. ప్ర‌జ‌ల‌తో అస్స‌లు క‌నెక్ష‌న్ లేని కేసీఆర్ మాదిరి ఉండ‌కూడ‌ద‌నే వారు.. అదే ప‌నిగా స‌మీక్ష‌లు.. వీడియో కాన్ఫ‌రెన్స్ ల‌తో ఉద‌ర‌గొట్టే బాబు మాదిరి అస్స‌లు ఉండ‌కూడ‌ద‌న్న మాట త‌ర‌చూ వినిపిస్తూ ఉంటుంది. మ‌రెలా ఉండాల‌న్న దానిపై ప‌లువురు ప‌లు వ్యాఖ్య‌లు చేస్తుంటారు. ఇవేమీ ఇద్ద‌రు చంద్రుళ్ల‌లో అస్స‌లు క‌నిపించ‌ని ప‌రిస్థితి.

ఇదిలా ఉంటే.. తాజాగా ముఖ్య‌మంత్రి అన్న వ్య‌క్తి ఎలా ఉండాలన్న విష‌యంపై చిన్న‌పాటి టీజ‌ర్ ను జ‌గ‌న్ చూపించిన‌ట్లుగా చెబుతున్నారు. కొన్ని కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రు కావ‌టం ఎంత ముఖ్య‌మో.. కొన్ని కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉండ‌టం అంతే ముఖ్యం. ఆ విష‌యంలో త‌న‌కున్న క్లారిటీని జ‌గ‌న్ చేత‌ల్లో చేసి చూపించార‌ని చెప్పాలి. తాజాగా విజ‌య‌వాడ‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది. ఎన్నిక‌ల కౌంటింగ్ రోజున ఏం చేయాల‌న్న‌ది ఆ ప్రోగ్రాం ఎజెండా. దీనికి 175 అసెంబ్లీ స్థానాల అభ్య‌ర్థులు (జ‌గ‌న్ త‌ప్ప‌).. పాతిక ఎంపీ స్థానాల అభ్య‌ర్థులు.. చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు హాజ‌ర‌య్యారు. మ‌రింత కీల‌క కార్య‌క్ర‌మానికి జ‌గ‌న్ రాకుండా ఉండ‌టం అంద‌రిలో ఆశ్చ‌ర్యం వ్య‌క్త‌మైంది.

వాస్త‌వానికి.. ఇలాంటి కార్య‌క్ర‌మం కానీ టీడీపీ నిర్వ‌హిస్తే.. ప్రోగ్రాం మొత్తం త‌న మీద‌నే ఫోక‌స్ అయ్యేలా చేస్తారు. కానీ.. జ‌గ‌న్ మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌టం ఆస‌క్తిక‌ర‌మైన అంశంగా చెప్పాలి. ఎందుకంటే.. కొన్నిసీరియ‌స్ ప్రోగ్రాంల‌కు అధినేత రావాల్సిన అవ‌స‌రం లేదు. శిక్ష‌ణ లాంటి వాటికి అధినేత వ‌స్తే.. నేత‌ల ఫోక‌స్ మొత్తం అధినాయ‌కుడిగా మీద‌నే ఉంటుంది త‌ప్ప.. కార్య‌క్ర‌మం మీద ఉండ‌దు. ఈ విష‌యాన్ని గుర్తించే జ‌గ‌న్ తాజా శిక్ష‌ణ కార్య‌క్ర‌మానికి రాలేద‌న్న మాట వినిపిస్తోంది. సీరియ‌స్ గా ప‌ని జ‌ర‌గ‌టం ముఖ్యం త‌ప్పించి.. అన‌వ‌స‌ర‌మైన ఆర్భాటం.. హ‌డావుడి.. ప్ర‌చారం త‌న‌కు అవ‌స‌రం లేద‌న్న విష‌యాన్ని జ‌గ‌న్ త‌న చేత‌ల‌తో చేసి చూపించార‌ని చెప్పాలి. టీజ‌ర్ తోనే స‌రికొత్త ఫీల్ క‌లిగించిన జ‌గ‌న్‌.. ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాక పాల‌న‌లో మ‌రెన్ని మెరుపులు మెరిపిస్తారో?