Begin typing your search above and press return to search.

గుజ‌రాత్ః ఈవీఎంల వ‌ద్ద వైఫై బంద్

By:  Tupaki Desk   |   18 Dec 2017 5:02 AM GMT
గుజ‌రాత్ః ఈవీఎంల వ‌ద్ద వైఫై బంద్
X
పటిదార్‌ నేత హార్దిక్‌ పటేల్ డిమాండ్ ఫ‌లించింది. గుజరాత్‌ లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషన్లను (ఈవిఎం)లను ట్యాంపరింగ్‌ చేసేందుకు కొంతమంది సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్లను అద్దెకు తెచ్చుకున్నారంటూ ఆయ‌న ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూంల వద్ద వైఫై సేవలను దుర్వినియోగపరుస్తున్నారేమోనన్న అనుమానాలు వ్యక్తం కావడంతో, వాటిని నిలిపివేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. త‌ద్వారా హార్దిక్ - కాంగ్రెస్ పా్టీ చేసిన డిమాండ్ నెగ్గింద‌ని అంటున్నారు.

సూరత్‌ లోని గాంధీ ఇంజినీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్‌రూంలో ఆరు స్థానాల ఈవీఎంలను భద్రపరిచారు. అక్కడ వైఫై సేవలు అందుబాటులో ఉండడంతో కమ్రేజ్ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ జరీవాలా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. రెండురోజుల క్రితం ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకున్నారని - కానీ మళ్లీ వైఫై సేవల ప్రారంభంతో అనుమానాలొస్తున్నాయన్నారు. దీంతో వైఫై సేవల్ని రద్దు చేయాలని కళాశాల నిర్వాహకుల్ని సూరత్ కలెక్టర్ మహేంద్ర పటేల్ ఆదేశించారు.

కాగా, ఈఎంలను హ్యాక్ చేసి ఫలితాలను మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని పాటిదార్ నేత హార్దిక్ పటేల్ ఆరోపించారు. 4000 ఓటింగ్ యంత్రాల హ్యాకింగ్‌కు అహ్మదాబాద్‌లోని కంపెనీకి చెందిన 140మంది ఇంజినీర్లను వాడుకుంటున్నారు అని ట్వీట్ చేశారు. `దేవుడు సృష్టించిన మానవ శరీరాన్ని మార్చగలిగినప్పుడు - మనిషి సృష్టించిన ఈవీఎంను మార్చడం అసాధ్యమా? ఏటీఎంలను హ్యాక్ చేయగలిగినప్పుడు ఈవీఎం ఒక లెక్కా?` అని హార్దిక్ వరుస ట్వీట్లలో ప్రశ్నించారు. గుజరాత్‌ లో గెలువడం బీజేపీకి అత్యవసరమని - అందుకే ఎంతకైనా తెగిస్తున్నదన్నారు. ఇక్కడ గెలిచి - హిమాచల్‌ లో ఓటమి ద్వారా అనుమానం రాకుండా ఉండేందుకు బీజేపీ ప్లాన్ చేసుకున్నదని ఆరోపించారు.గుజరాత్‌ లోని విస్‌ నగర్‌ - రాధనపూర్‌ - వావ్‌ తో పాటు గిరిజన ప్రాంతాల్లోనూ, పటేళ్ళ ఆధిపత్యం గల ప్రాంతాల్లోనూ హ్యాకింగ్‌ చేసే ప్రయత్నం జరుగుతున్నదంటూ ఆరోపించారు.

ఇదిలాఉండ‌గా...గుజరాత్ - హిమాచల్ ప్రదేశ్ రాష్ర్టాల్లో శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ రెండు రాష్ర్టాల్లో బీజేపీ - కాంగ్రెస్ పార్టీల మధ్య పోటాపోటీ ఉంది. తొలి ఫలితం ఉదయం 11.30 గంటలకు వెలువడే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2 గంటల వరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది.