Begin typing your search above and press return to search.
ఎఫైర్ల గోల: పగలు భర్త, రాత్రి ప్రియుడు.. ట్విస్ట్ ఏంటంటే?
By: Tupaki Desk | 6 Aug 2021 4:14 AM GMTపెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న ఓ యువతి చక్కగా భర్తతో కలిసి జీవించసాగింది. జీవితాంతం ఆనందంగా గడపడానికి సిటీకి వచ్చింది. కుటుంబాన్ని పోషించడానికి భర్త ఏదో ఒక పనిచేయాలి కాబట్టి.. ఓ ఆటోను కొనుక్కొని రోజూ డబ్బులు సంపాదించేవాడు. ఇలా ఆనందంగా సాగుతున్న వారి సంసారంలోకి ఓ వ్యక్తి వచ్చాడు. అతడేవరో కాదు కొత్తగా పెళ్లి చేసుకున్న వ్యక్తి స్నేహితుడు. తన స్నేహితుడికి సాయం చేద్దామని జీవనోపాధి కోసం సొంత ఆటో నడుపుకోమని అవకాశం ఇచ్చాడు. అంతేకాకుండా తన ఇంట్లో ఉండడానికి అవకాశం ఇచ్చాడు. అయితే ఇంత సాయం చేసినా అతనికి ఆ స్నేహితుడు ఏం చేశాడో తెలుసా..? ఏకంగా తన భార్యతో కలిసి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు..
కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల భార్య తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ భర్త కోసం వెతికారు. చివరికి ఫిర్యాదు చేసిన భార్య ఓ వ్యక్తితో కలిసి తిరుగుతుండడాన్ని గమనించారు. అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను విచారించారు. ఆ తరువాత మరోరోజు ఆమెతో కలిసున్న వ్యక్తిని తమదైన శైలిలో ఎంక్వైరీ చేశారు. దీంతో మైండ్ బ్లాకయ్యే విషయాలు బయటికి వచ్చాయి. అయితే అప్పటికే విషయం తెలుసుకున్న భార్య పోలీసులు కన్నుగప్పి పారిపోయింది. ఇంతకీ మొత్తానికి జరిగిందేమీటో పోలీసులు నిర్దారణకు వచ్చారు. అసలు జరిగిన కథేంటో చూద్దాం..
కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటన సంచలనంగా మారింది. మాండ్య జిల్లా మద్దూరు తాలుకాలోని అప్పనహళ్లి గ్రామానికి చెందిన కార్తీక్ అనే యువకుడు రజిత అనే యువతితో 2016లో వివాహం జరిగింది. పెద్దలు కుదిర్జిన పెళ్లి కావడంతో ఇద్దరు కొన్నాళ్లు తమ ఊరిలోనే కాపురం నిర్వహించారు. అయితే ఉపాధి కోసం కార్తీక్ బెంగుళూరు వెళ్లారు. ఆ తరువాత తన భార్యను కూడా తీసుకొని వెళ్లి బృందావనర్ నగర్లో అద్దెకు ఉన్నారు. ఈ క్రమంలో కార్తీక్ ఓ ఆటో కొనుక్కొని రోజూ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఈక్రమంలో కార్తీక్ చిన్న నాటి స్నేహితుడు తన ఊరి సమీపంలోని కేఆర్ పేట కు చెందిన ఎంఎస్ సంజు బెంగుళూరుకు ఉపాధికోసం వచ్చాడు. దీంతో తన ప్రాణస్నేహితుడు కాబట్టి కార్తీక్ తనకు సాయం చేయాలని అనుకున్నాడు. దీంతో తన ఆటో నడుపుకొమ్మిని సూచించాడు. పగలు తన స్నేహితుడు, రాత్రి కార్తీక్ ఆటో నడుపుతూ జీవనం సాగించారు. అయితే సంజుకు ఇల్లు లేదని గమనించిన కార్తీక్ తన ఇంట్లోనే ఉండమని కోరాడు. దీంతో కార్తీక్ దంపతులతో సంజు కూడా కలిసుండేవాడు.
ఈ క్రమంలో కార్తీక్ ఆటో నడపడానికి బయటికి వెళ్లినప్పుడు అతని భార్య రజితపై కన్ను పడింది. దీంతో ఆమెతో సన్నిహితంగా ఉండసాగాడు. ఆ తరువాత రజిత కూడా సంజూ ప్రేమలో పడింది. దీంతో కార్తీక్ బయటకు వెళ్లినప్పుడు ఇద్దరు ఎంజాయ్ చేసేవారు. అయితే వీరి ప్రేమ మరింత దగ్గరగా కావడంతో భర్త కార్తీక్ ను తొలగించాలని రజిత నిర్ణయించుకుంది. ఆ విషయాన్ని ప్రియుడు సంజుకు తెలిపింది.
దీంతో కార్తీక్ ను సంజు, అతని కజిన్ బ్రదర్ సుబ్రహ్మణం కలిసి చంపేయాలని డిసైడ్ అయ్యారు. జూలై 29న రాత్రి కార్తీక్ ను సంజు, సుబ్రహ్మణ్యంలతో పాటు అతని భార్య రజితలు బయటకు తీసుకెళ్లి బాగా మద్యం తాగించారు. ఆ తరువాత అతనిపై దాడి చేసి బండరాళ్తో మోదారు. ఆ తరువాత డెడ్ బాడీని గోనె సంచిలో మూటకట్టి రాజేశ్వరి మెడికల్ కాలేజీ సమీపంలో పడేశారు.
ఆ తరువాత తన భర్త కనిపించడం లేదని పోలీసులకు తెలిపిన రజిత గురించి తెలుసుకున్న కెంపెగౌడ నగర పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. ఇలా తన స్నేహితుడికి సాయం చేసినందుకు ఉపకారం ఇదేనా..? అని కొందరు చర్చించుకుంటున్నారు.