Begin typing your search above and press return to search.
హైదరాబాద్ లో ఐటీ భర్తను చంపించిన భార్య
By: Tupaki Desk | 5 Jan 2018 6:15 AM GMTమరో షాకింగ్ హత్య ఒకటి బయటకు వచ్చింది. హైదరాబాద్ పోలీసు వర్గాల్లో కలకలం రేపటంతో పాటు.. ఎన్నో చిక్కుముడుల్ని మీద పడేంది. చేసిన నేరాల్ని ఎవరూ దాచలేరు. ఎంతటి మొనగాడు నిందితుడైనా.. ఎక్కడో దగ్గర తప్పు చేస్తాడు. అంతిమంగా తప్పు చేసినోడు చట్టానికి దొరకాల్సిందే. ఇది నిజమని మరోసారి ఫ్రూవ్ అయ్యింది. హైదరాబాద్ లో ఇటీవల జరిగిన దారుణ హత్య ఒకటి అనూహ్యంగా బయటకు వచ్చింది.
గుట్టు చప్పుడు కాకుండా ఐటీ ఉద్యోగి అయిన భర్తను అత్యంత దారుణంగా చంపించిన భార్య ఉదంతం తాజాగా బయటకు వచ్చింది. డిసెంబరు 31న జరిగిన ఈ హత్య ఉదంతం బయటకు వచ్చేదే కాదు. కానీ.. హత్యలో పాలుపంచుకున్న ఒక వ్యక్తి లో చోటు చేసుకున్న భయం మర్డర్ గురించి వెల్లడించేలా చేసింది. ఈ హత్య డిటైల్స్ లోకి వెళితే..
డిసెంబరు 31 రాత్రి ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి హత్యకు గురయ్యాడు. అయితే.. ఈ విషయం అస్సలు బయటకు రాలేదు. ఇంతకీ ఆ హత్య చేయించింది ఎవరో కాదు.. స్వయంగా ఐటీ ఎంప్లాయ్ భార్యే. అయితే.. హత్య చేసిన నలుగురిలో ఒకరిలో కొత్త భయం పుట్టుకొచ్చింది. తామంతా చేసిన హత్యను తన మీదన ఎక్కడ వేస్తారోనన్న సందేహం కలిగింది. ఇది టెన్షన్ గా మారి.. భరించలేని అతగాడు ఆందోళనతో సూసైడ్ అటెంప్ట్ చేశారు. పోలీసులు పట్టుకుంటారన్న భయాందోళనల మధ్య గొంతు కోసుకున్నాడు. అతడ్ని గాంధీ ఆసుపత్రికి చేర్చారు. సూసైడ్ యత్నం కింద నేరం నమోదు చేసి.. విచారణ కోసం అతడ్ని కలిశారు. వివరాలు అడిగే క్రమంలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి.
సూసైడ్ వెనుక షాకింగ్ హత్య ఉందన్న విషయం తెలిసిన పోలీసుల నోట మాట రాని పరిస్థితి. సూసైడ్ పయత్నం చేసిన వ్యక్తి పేరు నరేశ్. లాలాపేట నివాసి. ఇతడు పోలీసులకు చెప్పిన సమాచారం ప్రకారం ఐటీ ఉద్యోగి నాగరాజును తాము హత్య చేసినట్లుగా చెప్పాడు. నాగరాజు సతీమణి జ్యోతి తనకున్న వివాహేతర సబంధం నేపథ్యంలో హత్య చేయించిందని చెప్పారు. జ్యోతి ప్రియుడు కార్తీక్ నాగరాజును అడ్డు తొలగించుకునేందుకు తన స్నేహితులైన మరో ముగ్గురితో కలిసి హత్య చేశారు. ఆ ముగ్గురు స్నేహితుల్లో నరేశ్ ఒకడు.
లాలాపేటలో భార్య జ్యోతితో కలిసి అద్దెకు ఉంటున్న నాగరాజుకు కార్తీక్ అనే యువకుడితో పరిచయమైంది. ఇంటికి వస్తూ పోతుండేవాడు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. కార్తీక్‌కు జ్యోతికి పూర్వ పరిచయం ఉంది. వారిద్దరూ గతంలో ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నా కుదర్లేదు. గత పరిచయం వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి కారణమైంది. దీంతో.. అడ్డు తొలగించేందుకు హత్యకు ప్లాన్ చేశారు.
డిసెంబరు 31న అందరూ హడావుడిగా ఉండే వేళలో.. భర్తకు మత్తుమాత్రలు ఇవ్వటం ద్వారా స్పృహ కోల్పోయిన సమయంలో తల మీద బలంగామోదటం ద్వారా హత్య చేశారు. అనంతరం వారు మృతదేహాన్ని తీసుకొని చౌటుప్పల్ లోని ఒక నిర్జన ప్రదేశంలో పడేసి వచ్చారు.
గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు మృతదేహంలో లభించిన చిన్న చీటి ఆధారంగా నాగరాజు సతీమణి జ్యోతికి ఫోన్ చేశారు. భర్త శవాన్ని చూసి కన్నీరు మున్నీరైంది. అయితే.. పోస్ట్ మార్టం రిపోర్టు కాస్త తేడా రావటం.. బలమైన ఆయుధంతో కొట్టటం వల్ల మృతి చెందాడన్న విషయంతో నాగరాజు పోన్ డేటాను పరిశీలించగా అందులో సమాచారం లభించలేదు. అనుమానం వచ్చి జ్యోతి కాల్ డేటాను పరిశీలించగా.. డిసెంబరు 30.. 31 తేదీల్లో ఒకే నెంబరు నుంచి పలుమార్లు ఫోన్లు వచ్చినట్లుగా గుర్తించారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా విషయం బయటకు వచ్చింది. అదే సమయంలో తాము దొరికిపోతామన్న ఉద్దేశంతో భయపడిన నరేశ్ గొంతు కోసుకొని ఆత్మహత్యయత్నం చేశాడు. ఇలా చేసిన నేరం రెండు విధాలుగా బయటకు వచ్చింది. నిందితుల్ని అదుపలోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు.