Begin typing your search above and press return to search.

ఎంత కోపం ఉంటే మాత్రం.. భర్తను అంత ఆరాచకంగా హత్య చేయటమా?

By:  Tupaki Desk   |   5 Jun 2020 1:00 PM GMT
ఎంత కోపం ఉంటే మాత్రం.. భర్తను అంత ఆరాచకంగా హత్య చేయటమా?
X
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దాదాపు పదిహేనేళ్లు కాపురం చేశారు. వారి అనుబంధానికి గుర్తుగా పద్నాలుగేళ్ల పాప కూడా ఉంది. చేసేది కూలి పనే అయినా.. కొంతకాలం వరకూ అన్యోన్యంగానే ఉంటున్నారు. అలాంటి వారి జీవితాల్లోకి మద్యం ఎంట్రీ ఇచ్చింది. భార్యభర్తలు ఇద్దరూ మద్యానికి బానిసలు అయ్యారు. దీంతో.. వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. చివరకు భర్తను అత్యంత దారుణంగా హత్య చేసిన వైనం సంచలనంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా టి. నరసాపురం మండలం మక్కినవారిగూడెంలో చోటు చేసుకున్న ఈ హత్య విస్తుపోయేలా చేస్తోంది.

మక్కినవారిగూడెనికి చెందిన అప్పారావు తెలంగాణకు చెందిన లక్ష్మీని పదిహేనేళ్ల క్రితం ప్రేమించి పెళ్లాడారు. కూలి పనులు చేసుకుంటూ బతికే వారు.. కొద్దికాలంగా మద్యానికి అలవాటు పడ్డారు. చివరకు బానిసలుగా మారారు. ఈ క్రమంలో వారి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఇటీవల అవి కాస్త మరింత ఎక్కువ అయ్యాయి. భర్త చేష్టలతో విసుగు చెందిన లక్ష్మీ దారుణానికి తెగబడింది.

మద్యం మత్తులో రచ్చ చేసిన భర్త నిద్ర పోతున్న వేళ.. అతన్ని ఇంట్లో నవ్వారు మంచానికి కట్టేసింది. గొంతుకు తాడు బిగించి ఊపిరి ఆడకుండా చేసింది. బట్టలు తీసేసి.. మర్మాంగాలను కోసేసింది. భర్తను చంపేసిన ఆమె.. తర్వాత భర్త సోదరుడికి విషయాన్ని చెప్పి.. పోలీసులకు లొంగిపోయింది. ఎంత కోపం ఉంటే మాత్రం.. పదిహేనేళ్లు కలిసి బతికిన భర్తను అంత దారుణంగా హతమార్చటమా? అన్నదిప్పుడు చర్చగా మారింది.