Begin typing your search above and press return to search.

భర్తపై 29 గంటలు అత్యాచారం చేసిన భార్య?

By:  Tupaki Desk   |   29 Oct 2015 4:00 AM IST
భర్తపై 29 గంటలు అత్యాచారం చేసిన భార్య?
X
వినేందుకు విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం. మనకు పూర్తిగా కొత్తగా ఉండే కొన్ని దేశాల చట్టాల ప్రకారం భార్యభర్తల మధ్య శృంగారానికి పరస్పర అనుమతి ఉండాల్సిందే. అంతేకానీ.. ఒకరి బలవంతం మీద చేసే రొమాన్స్ చట్టప్రకారం నేరం అవుతుంది. తాజాగా అలాంటి చట్టాలున్న దక్షిణ కొరియాలో ఒక కేసు నమోదైంది. అయితే.. ఈ కేసులో భార్య మీద భర్త కాకుండా.. భర్త మీదనే భార్య అత్యాచారం చేసిందని.. అది కూడా గంటో.. రెండు గంటలో కాకుండా 29 గంటల పాటు జరిపిందన్నది సదరు అమాయక భర్త ఆరోపణ.

దక్షిణకొరియాలోని చట్టాల ప్రకారం.. భార్యభర్తల మధ్య పరస్పర అనుమతి లేకుండా సెక్స్ చేయటం నేరం. ఇలాంటి చట్టాన్ని 2013లో తీసుకొచ్చారు. అలా చట్టం వచ్చిన తర్వాత తొలిసారి ఇలాంటి ఫిర్యాదు పోలీసులకు అందింది. అది కూడా భార్య మీద భర్త పెట్టటం సంచలనంగా మారింది. తనను గదిలో బంధించిన తన భార్య.. 29 గంటల పాటు గదిలోనే ఉంచేసి.. బలవంతంగా శృంగారానికి పురిగొల్పిందని సదరు భర్త వాపోయినట్లుగా పోలీసులు చెబుతున్నారు. విడాకులు తీసుకునేందుకే ఆమె ఇలాంటి పని చేసిందని అతగాడు ఆరోపిస్తున్నాడు. మరి.. భర్త గారి వాదనను పరిగణలోకి తీసుకొని చట్టం.. అక్కడి కోర్టులు ఈ భార్యమణికి ఎలాంటి శిక్ష విధిస్తుందో చూడాలి.