Begin typing your search above and press return to search.

మేసేజ్ లు చూస్తున్న భర్త వేళ్లను కోసేసిన భార్య

By:  Tupaki Desk   |   16 May 2016 10:01 AM GMT
మేసేజ్ లు చూస్తున్న భర్త వేళ్లను కోసేసిన భార్య
X
అందుబాటులోకి వచ్చిన సాంకేతికత కారణంగా లాభాలు ఎన్ని వస్తున్నాయో నష్టాలు కూడా అన్నే ఉంటున్నాయి. టెక్నాలజీని వినియోగించుకునే విషయంలో ఒక్కొక్కరూ ఒక్కోలా వ్యవహరిస్తుంటారు. సుబ్బరంగా కాపురం చేసుకోవాల్సిన భార్యభర్తల మధ్య సెల్ ఫోన్ లొల్లి ఈ మధ్యన ఎక్కువే అయ్యిందని చెప్పొచ్చు. ఇది సరిపోదన్నట్లు దీనికి సోషల్ మీడియా జత కలవటంతో ఎన్నో కాపురాలు కలహాలతో నిండిపోతున్నాయి. ఈ గొడవలు కొన్ని హద్దులు మీరుతూ కేసులు.. పోలీసుల చుట్టూ తిరిగే పరిస్థితి. బెంగళూరులో చోటు చేసుకున్న తాజా ఉదంతం కూడా ఇలాంటిదే.

భెంగళూరుకు చెందిన సునీతా సింగ్ టీచర్ గా పని చేస్తోంది. ఆమె భర్త చంద్రకాంత్ సింగ్ ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు. హాయిగా సాగిపోవాల్సిన వారి కాపురంలో సెల్ ఫోన్ చిచ్చు రేపింది. పొద్దస్తమానం తన భార్య సెల్ ఫోన్ పట్టుకొని ఛాటింగ్ ల మీద ఛాటింగ్ లు చేయటంతో భార్య.. భర్తల మధ్య తరచూ గొడవలు చోటు చేసుకునేవి. ఛాటింగ్ లు తగ్గించాలని భార్యకు ఎన్నిసార్లు చెప్పినా ఆమె మాట వినని పరిస్థితి.

ఇదిలా ఉండగా.. తాజాగా ఆమె ఫోన్ లో చాటింగ్ లు చూసిన చంద్రకాంత్ సింగ్ కు షాక్ తగిలినంత పనైంది. ఎందుకంటే.. చాలా చాటింగ్ లలో తన భార్యను డార్లింగ్.. డియర్ అంటూ మేసేజ్ లు చూసిన అతనికి పిచ్చి కోపం వచ్చేసింది. చాటింగ్ ల గురించి అడుగుతున్న భర్త తీరుతో తీవ్రంగా ఆవేశపడిన సునీతా సింగ్ తన ఫోన్ ను చూడటం ఏమిటంటూ.. వంటింట్లో వంట చేస్తున్న ఆమె చేతిలోని కత్తితో.. భర్త మూడు వేళ్లను కోసి పారేసింది. ఊహించని పరిణామంతో షాక్ తిన్న అతగాడు.. లబోదిబోమంటూ ఆసుపత్రికి పరిగెత్తిన పరిస్థితి. గృహహింస కింద భార్య మీద కేసు పెట్టి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.