Begin typing your search above and press return to search.

ఏపీ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో ఘోరం!

By:  Tupaki Desk   |   17 Nov 2016 5:09 PM GMT
ఏపీ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో ఘోరం!
X
ఇటీవ‌ల‌ దేశ‌వ్యాప్తంగా అంద‌రినీ క‌లిచివేసిన సంఘ‌ట‌న ఒక‌టి మీకు గుర్తుండే ఉంటుంది. ఆస్ప‌త్రి వ‌ర్గాలు ఆంబులెన్స్ ఇచ్చేందుకు నిరాక‌రించ‌డంతో ఒడిషాకు చెందిన ఓ వైద్యుడు త‌న భార్య శ‌వాన్ని సుమారు 12 కిలోమీట‌ర్ల పాటు భుజంపై మోసుకుంటూ వెళ్లాడు. ఆ ఘ‌ట‌న అంద‌ర్నీ ఆవేద‌న‌కు గురిచేసింది. దాదాపుగా అలాంటి ఘ‌ట‌నే ఆంధ్రప్ర‌దేశ్‌లోని అనంత‌పూర్ జిల్లా గుంత‌క‌ల్లు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో జ‌రిగింది. ఆనారోగ్యంతో ఉన్న త‌న భ‌ర్త‌ను ద‌వాఖ‌న‌లోని మొద‌టి అంత‌స్తుకు తీసుకువెళ్లేందుకు ఆస్ప‌త్రి వ‌ర్గాలు స్ట్రెచ‌ర్ ఇవ్వ‌డానికి నిరాక‌రించ‌డంతో...ర్యాంపై పై నుంచి త‌న భ‌ర్త‌ను ఈడ్చుకుంటూ పైకి తీసుకువెళ్లింది.

అనంత‌పురానికి చెందిన శ్రీ‌నివాస‌చారి అనే వ్య‌క్తి హైద‌రాబాద్‌లో సెక్యురిటీ గార్డుగా ప‌నిచేస్తున్నాడు. కొద్దిరోజుల కింద‌ట ఆయ‌న స్వ‌గ్రామానికి వ‌చ్చాడు. జ్వ‌రంలో పాటు క‌డుపునొప్పి ల‌క్ష‌ణాల‌తో ఉండ‌టంతో ఆయ‌న భార్య గుంత‌క‌ల్లు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి తీసుకువెళ్లింది. పై అంత‌స్తులో వైద్యం కోసం తీసుకువెళ్లేందుకు స్ట్రెచ‌ర్ కానీ వీల్ చైర్ కానీ ఇవ్వ‌మ‌ని కోరింది. అయితే ఆస్పత్రి వ‌ర్గాలు నో చెప్ప‌డంతో వేరే గ‌తి లేక ర్యాంప్ పై నుంచి లాక్కొని పైకి తీసుకువెళ్లింది. ఇలా కొద్ది దూరం లాక్కొని వెళ్లిన త‌ర్వాత స‌ద‌రు స‌ర్కారీ ద‌వాఖ‌న వారు స్ట్రెచ‌ర్ ఇచ్చారు.

ఈ మేర‌కు ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన వార్త‌ల‌పై ఆస్ప‌త్రి ఇంచార్జీ మ‌ల్లిఖార్జున రెడ్డి స్పందిస్తూ త‌మ ఆస్ప‌త్రిలో ఐదు స్ట్రెచ‌ర్లు ఉండ‌గా శ్రీ‌నివాస‌చారి ఆస్ప‌త్రికి వ‌చ్చే స‌రికి అన్నీ ఫుల్ అయిపోయాయ‌ని వివ‌రించారు. అయితే ఈ చ‌ర్య‌పై త‌గు నివేదిక ఇవ్వాల‌ని ఆస్ప‌త్రి వ‌ర్గాల‌ను ఆదేశించిన‌ట్లు తెలిపారు. ఇదిలాఉండ‌గా ఈ హృద‌య విదార‌క ఘ‌ట‌న సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మార‌డం, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆరోగ్య శాఖ దృష్టికి పోవ‌డం వారు స్పందించార‌ని తెలుస్తోంది. అయితే ఏ విధ‌మైన చ‌ర్య‌లు తీసుకున్నార‌నేది తెలియాల్సి ఉంది.