Begin typing your search above and press return to search.

తాగుతున్నాడ‌ని క‌ళ్ల‌లో ఫెవిక్విక్ పోసింది

By:  Tupaki Desk   |   19 July 2016 6:14 PM GMT
తాగుతున్నాడ‌ని క‌ళ్ల‌లో ఫెవిక్విక్ పోసింది
X
తాగుబోతురాయుడైన మొగ‌డికి ఓ భార్య ఇచ్చిన షాక్ ట్రీట్‌ మెంట్ నిజ్జంగా షాకింగ్‌ లాగా ఉంది. తాగుడు మానేయాల‌ని భర్త‌కు ఎంత చెప్పిన విన‌క‌పోవ‌డంతో ఏకంగా కళ్ల‌ల్లో ఫెవిక్విక్ పోసేసింది. దీంతో స‌ద‌రు భ‌ర్త గారికి దిమ్మ తిరిగిపోయింది.మధ్యప్రదేశ్‌ లోని రేవా జిల్లాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

సంతోష్ విశ్వకర్మ ఓ పెద్ద తాగుబోతు. ఎంత చెప్పిన విన‌క‌పోవ‌డంతో ఒక‌రోజు గురుడు పూటుగా తాగి వ‌చ్చిన‌పుడు క‌ళ్ల‌ల్లో ఆయ‌న భార్య విజ‌య‌లక్ష్మీ ఫెవిక్విక్ పోసేసింది. ఎప్ప‌ట్లాగే పొద్దున్నే మేలుకున్న సంతోష్‌...కళ్లు తెరుచుకోవడానికి సిద్ధ‌ప‌డ‌గా చాలా క‌ష్టం ఎదురైంది. భార్య విజయలక్ష్మి కోసం కేక వేయ‌గా ఆమె లైట్ తీసుకుంది.దీంతో సంతోషే క‌ష్ట‌ప‌డి నీళ్లతో శుభ్రం చేసుకునే ప్ర‌య‌త్నం చేశాడు. అయిన‌ప్ప‌టికీ ఫలితం లేకపోయింది. గావుకేక‌లు పెడుతున్న అత‌నికి స‌హాయం చేసేందుకు చుట్టుప‌క్క‌ల వారు ప్ర‌య‌త్నించారు. అయితే ఫెవిక్విక్ ప‌వ‌ర్‌ తో క‌ళ్లు తెర‌వ‌లేదు.

ఇక లాభం లేద‌ని పోలీసులను పిలిచారు. వారు వ‌చ్చిన సంతోష్‌ ను డాక్ట‌ర్ వ‌ద్ద‌కు తీసుకువెళ్ల‌గా వాళ్లు పరీక్షించి చూడ‌డంతో ఫెవిక్విక్ అని తేలింది. దీంతో అష్ట‌క‌ష్టాలు ప‌డి వైద్యం చేశారు. ఇపుడయితే సంతోష్ క‌ళ్ల‌కు ఎలాంటి ప్రాబ్లం లేద‌న్నారు. దీంతో సంతోస్ సంబ‌ర‌ప‌డిపోయాడు. అయితే ఆయ‌న భార్య మాత్రం భ‌ర్త‌కు భ‌య‌ప‌డి ఎటో పారిపోయింది. ఇంత‌కీ సంతోష్ తాగుడు మానేస్తాడా లేదా అనేదే క‌దా మీ సందేహం? వేచి చూడాల్సిందే.