Begin typing your search above and press return to search.

భార్య సంపాదనపరురాలైనా భరణం పొందే హక్కు ఉంది!

By:  Tupaki Desk   |   16 Jun 2022 5:30 PM GMT
భార్య సంపాదనపరురాలైనా భరణం పొందే హక్కు ఉంది!
X
దేశంలోని కోర్టుల తీర్పులు పలు అంశాల్లో సంచలనమవుతున్నాయి. ముఖ్యంగా విడాకులు, మానవ సంబంధాల విషయాల్లో హైకోర్టుల తీర్పులు దేశంలో చర్చకు దారితీస్తున్నాయి. కొన్ని సార్లు వివాదాస్పదంగా.. మరికొన్ని సార్లు సానుకూలంగా వస్తున్నాయి. ఇటీవల కేరళ, ముంబై హైకోర్టులు విచిత్రమైన తీర్పులు ఇచ్చి వార్తల్లోకెక్కాయి. తాజాగా రాజస్థాన్ హైకోర్టు కూడా అలాంటి తీర్పునే ఇచ్చింది. ఇదిప్పుడు చర్చనీయాంశమైంది.

భర్త క్రూరత్వాన్ని తట్టుకోలేక భార్య వెళ్లిపోతే.. శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్లిపోయినట్లుగా పరిగణించలేమని రాజస్థాన్ మైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఓ పిటీషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది.

బ్యాంక్ ఆఫ్ బరోడాలో బ్రాంచ్ మేనేజర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి నెలకు రూ.90 వేలు సంపాదిస్తున్నాడు. అతడికి భార్యతో ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలోనే విడాకులు కావాలంటూ ట్రయల్ కోర్టును ఆశ్రయించాడు.

ఇక ఆ భార్య తన భర్త నుంచి భరణం అందించేలా చర్యలు తీసుకోవాలని కోర్టును కోరింది. దీనికి భర్త ససేమిరా అంటూ మరో పిటీషన్ దాఖలు చేశాడు. ఆమెకు ఉద్యోగం ఉందని.. తనతో కలిసి ఉండడం లేదని ఇవ్వలేనని తెలిపాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు నెలవారీ భరణం ఇచ్చేందుకు నిరాకరించింది.

దీంతో ఆ భార్య హైకోర్టును ఆశ్రయించింది. తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ పిటీషన్ విచారణ జరిపిన హైకోర్టు ఆ భార్య ఉండే హైదరాబాద్ లోని జీవన వ్యయాన్ని పరిగణలోకి తీసుకోవాలని తీర్పునిచ్చింది.

భార్య, కుమారుడికి భర్త చెల్లించే నెలవారీ భరణాన్ని పెంచాలని సూచించింది. భార్య సంపాదిస్తున్నప్పటికీ భర్త నుంచి అవసరమైన భరణాన్ని క్లెయిమ్ చేసుకునేందుకు ఆమెకు హక్కు ఉందని స్పష్టం చేసింది.