Begin typing your search above and press return to search.
మాజీ భర్త జీతం తెలుసుకునే హక్కు ఉందట
By: Tupaki Desk | 28 May 2018 4:35 AM GMTఆసక్తికర వ్యాఖ్య చేసిందో హైకోర్టు. తన భర్తకు వచ్చే జీతం ఎంతో తెలుసుకునే హక్కు భార్యకు ఉండటం పెద్ద విషయమే కాదు. కానీ.. మాజీ భార్యకు సైతం ఆ హక్కు ఉంటుందని స్పష్టంచేసింది కోర్టు. తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశం ఆసక్తికరంగా మారింది.
ఏ మహిళకైనా భర్తజీతం గురించి తెలుసుకునే హక్కు ఎలా ఉంటుందో.. మాజీ భర్త జీతానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవటం తప్పేం కాదని కోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాదు.. సదరు మాజీ భార్య కోరినట్లుగా ఆమె మాజీ భర్త జీతానికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలని ఆదేశించింది.
మధ్యప్రదేశ్ లోని బీఎస్ ఎన్ ఎల్ ఉన్నతాధికారిగా పని చేస్తున్న పవన్ కుమార్ తన భార్యతో విడిపోయారు. కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నారు. నెలకు రూ.7 వేలు చొప్పున భరణం ఇస్తున్నారు. ఇలాంటి వేళ.. ఆయన మాజీ భార్య కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. తన మాజీ భర్త పేస్లిప్పులు ఇవ్వాలని ఆమె కోర్టును కోరారు. అయితే.. కోర్టు ఆమె పిటిషన్ ను కొట్టివేసింది.
దీంతో.. ఆమె మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు స్పందిస్తూ.. సునీతా జైన్ కోరినట్లుగా ఆమె మాజీ భర్త పే స్లిప్పులు ఇవ్వాలంటూ బీఎస్ ఎన్ ఎల్ కు ఆదేశాలు జారీ చేసింది. విడాకులు తీసుకున్నంత మాత్రాన వివరాలు అందించకుండా అడ్డుకోలేరని.. జీతం వివరాలు తెలుసుకునే హక్కు ఉందని కోర్టు స్పష్టం చేసింది.