Begin typing your search above and press return to search.
మరో మహిళతో భార్య శృంగారం.. భర్తకు నష్టపరిహారం ఇవ్వాలన్న కోర్టు
By: Tupaki Desk | 26 March 2021 1:30 AM GMTహెడ్డింగ్ చదివినంతనే వింతగా.. విచిత్రంగా అనిపించిందా? నిజమే.. ఈ డిజిటల్ కాలంలో చోటు చేసుకుంటున్న సంఘటనలు.. వెలుగు చూస్తున్న పరిణామాలు షాకింగ్ గా మారుతున్నాయి. అక్రమ సంబంధానికి అడ్డంగా ఉన్నాడని ఏ పాపం తెలీని భర్తను భార్య చంపేయటం..తన సుఖాలకు అడ్డు వస్తున్న పిల్లల్ని తల్లి చంపేయటం లాంటి దారుణాలు ఇటీవల కాలంలో తరచూ చూస్తున్నాం. ఇది చంపేయటం లాంటి నేరం కాదు కానీ.. మారుతున్న బంధాల గురించి తెలియజేసే ఉదంతంగా దీన్ని చెప్పాలి.
ఇప్పుడు చెప్పే వ్యవహారం జపాన్ లో చోటు చేసుకుంది. 39 ఏళ్ల వ్యక్తి భార్య మరో అమ్మాయితో శృంగారం చేసింది. వారి మధ్య అక్రమ సంబంధం ఉంది. అంటే.. స్వలింగ సంపర్కమన్న మాట. ఈ విషయం భర్తకు తెలిసింది. అతడు న్యాయం కావాలంటూ కోర్టును ఆశ్రయించాడు. తన భార్య.. మరో అమ్మాయితో అక్రమ సంబంధాన్ని పెట్టుకుందని.. శృంగారంలో పాల్గొంటుందని పేర్కొన్నాడు. ఆన్ లైన్ మొదలైన పరిచయం బెడ్ వరకు వచ్చినట్లుగా పేర్కొన్నాడు.
భర్త వాదనను పరిగణలోకి తీసుకున్న టోక్యో కోర్టు.. భార్యతో సంబంధం పెట్టుకున్న మహిళకు జరిమానా విధించింది. బాధితుడి భార్యతో సెక్స్ చేసినందుకు మన రూపాయిల్లో 70వేలు ఇవ్వాలని ఆదేశించింది. తాజాగా నేరారోపణలు ఎదుర్కొంటున్న మహిళ వాదన మరోలా ఉంది. అతడి భార్యకు.. నాకు మధ్య జరిగింది చట్టరీత్యా నేరం కాదు. దాని వల్ల వారి వైవాహిక జీవితానికి ఎలాంటి డ్యామేజ్ జరగలేదని పేర్కొంది. అయితే.. దీనికి కోర్టు అంగీకరించలేదు.
పెళ్లైన యువతితో లైంగిక సంబంధం పెట్టుకోవటం అశాంతికి గురి చేయటమేనని.. అందుకుఫైన్ చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ ఉదంతం జపాన్ సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. కోర్టు తీర్పుస్వలింగ సంపర్కాన్ని కోర్టు వ్యతిరేకిస్తున్నట్లుగా పలువురు అభిప్రాయపడుతున్నారు. నచ్చిన వ్యక్తులు ఇష్టపూర్వకంగా లైంగికంగా కలిస్తే తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. ఏమిటో ఈ కాలం.. మరెన్ని సిత్రాల్ని చూడాల్సి వస్తుందో?