Begin typing your search above and press return to search.

ఏపీలో భర్తను చంపి ప్రియుడితో ప్రియురాలి జంప్‌!

By:  Tupaki Desk   |   21 Nov 2022 8:31 AM GMT
ఏపీలో భర్తను చంపి ప్రియుడితో ప్రియురాలి జంప్‌!
X
ఇటీవల కాలంలో భర్తలను చంపే భార్యల సంఖ్య పెరుగుతోంది. తన బిడ్డలకు తండ్రే అని కనికరం లేకుండా, తనకు తాళి కట్టిన భర్త అనే విచక్షణ కూడా లేకుండా అక్రమ సంబంధాలకు అలవాటు పడుతున్న కొంత మంది మహిళలు భర్తలను కడతేరుస్తున్నారు.

తాజాగా ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో కలకలం రేపింది. ప్రియుడితో కలిసి ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను చంపింది.. ఓ ఇల్లాలు. భర్తను చంపి బస్తాలో మూటకట్టి చెరువులో పడేసిన ఒక కిరాతక మహిళ చేసిన ఘటన అందరినీ నివ్వెరపరిచింది.

ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాళెంకు చెందిన శోభ, మణి భార్యాభర్తలు. వీరిద్దరూ ప్రేమించుకుని కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. ఒక రొయ్యల గుంట వద్ద కాపలాగా ఉంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.

ఈ క్రమంలో భరత్‌ అనే వ్యక్తితో శోభకు పరిచయం ఏర్పడింది. ఇది అక్రమ సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలిసిన భర్త మణి.. తన భార్య శోభతో గొడవ పడ్డాడు. అయితే ప్రియుడిపై మోజు పెంచుకున్న శోభ తన సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించింది.

ఈ విషయాన్ని తన ప్రియుడికి చెప్పింది. తన భర్తను చంపేస్తే మనిద్దరం కలసి ఉండటానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని అతడికి వివరించింది. దీంతో నాలుగు రోజుల క్రితం తన ప్రియుడు భరత్, మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి తన భర్త మణిని పంటపాళెం గ్రామంలో నక్కల కాలువ వద్ద గొంతు నులిమి చంపించింది.

ఆ తర్వాత మణి శవాన్ని గోనె సంచిలో కట్టి నక్కల కాలువలో పడేశారు. ఈ గోనె సంచిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ గోనె సంచిను విప్పగా మృతదేహం బయటపడింది. ఈ డెడ్‌ బాడీని మణిగా గుర్తించారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ హత్య చేయించింది మణి భార్య శోభనేనని నిర్ధారించి, ఆమెతోపాటు ఆమె ప్రియుడు భరత్, ఇతర నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటన హత్య జరిగిన నాలుగు రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగు చూడటం గమనార్హం.

తండ్రి హత్యకు గురికావడం, తల్లి జైలుపాలు కావడంతో నలుగురు పిల్లలు అనాథలుగా మారారు. అక్రమ సంబంధం మోజులో చేతులారా తన కుటుంబంలో చిచ్చుపెట్టుకున్న శోభ ఇప్పుడు జైలులో ఊచలు లెక్కపెడుతోంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.