Begin typing your search above and press return to search.
ముగ్గురితో సంబంధం: అడ్డుగా ఉన్న భర్తకు విషం పెట్టి హత్య
By: Tupaki Desk | 28 July 2020 12:30 AM GMTవివాహేతర సంబంధాలు ఘోర పరిణామాలకు దారి తీస్తోంది. రహాస్య సంబంధాలు కుటుంబాలనే కలచివేస్తున్నాయి. ఆ అనైతిక బంధాలు తీరని విషాదం నింపుతున్నాయి. చివరకు అంత చేసిన వారు కటకటాలపాలవుతున్నారు. తాజాగా తమిళనాడులో ఓ భార్య ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేసింది. ఒకసారి విఫలం చెందగా.. మరోసారి ప్రయత్నించి చివరకు భర్తను చంపేసి పన్నాగం నెగ్గింది. ఆ విషయం పోలీసులకు తెలియడంతో ఆమె జైలు పాలయ్యింది. ఇంత చేసి సాధించినది ఏమిటంటే ఇద్దరి పిల్లలను అనాథగా చేసింది. అయితే పోలీసుల విచారణలో ఆమె గురించి ఊహించని సమాచారం తెలిసింది. ఆమె భర్త స్నేహితుడితో పాటు స్థానికంగా ఉండే మరో ఇద్దరితో సంబంధం కొనసాగించిందని తేలింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
చెన్నై పట్టణంలోని పూనమల్లి ప్రాంతంలో తరణిధరన్ కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అతడికి భార్య భవాని, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్నాళ్లు వీరి కాపురం సాఫీగా సాగింది. ఈ సమయంలో తరణిధరన్ తన భార్యకు అతడి స్నేహితుడు దినేశ్‌ను పరిచయం చేశాడు. అతడు కూడా కారు డ్రైవర్ గానే పని చేస్తున్నాడు. గతేడాది చివరలో దినేశ్‌ను ఇంటికి పిలుచుకోవడంతో భార్యతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో భవానీ.. దినేశ్ పరిచయం కాస్త ఫోన్ వరకు చేరింది. ఇద్దరు ఫోన్‌లలో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈక్రమంలో వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త తరణిధరన్ దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు దినేశ్ ఇంటికి వచ్చి భవానీతో ఏకాంతంగా గడపడం మొదలుపెట్టాడు.
నాలుగు నెలల కిందట దూర ప్రాంతానికి వెళ్తున్నానని తరణిధరన్ చెప్పి బయల్దేరాడు. ఈ విషయం దినేశ్ తెలుసుకుని ఇంటికి వచ్చాడు. అయితే అకస్మాత్తుగా ట్రిప్ రద్దవడంతో తరణిధరన్ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో భవానీ.. దినేశ్ ఏకాంతంగా ఉన్నారు. బెడ్ రూంలో భార్యతో దినేశ్ ఉండడం చూసి ఆగ్రహంతో తరణిధరన్ వారిపై కర్రతో దాడికి పాల్పడ్డాడు. భార్యను.. అతడిని మందలించి వదిలేశాడు. అయితే భార్య భవానీ ఇప్పుడు దినేశ్‌ను బయట కలవడం మొదలుపెట్టింది. అయితే భర్తను చంపేస్తే తమకు అడ్డు ఉండదని భావించి తరణిధరన్ హత్యకు ప్లాన్ వేసింది. లాక్ డౌన్ తో ట్రిప్‌లు లేక తరణిధరన్ ఇంటి వద్దే ఉంటున్ఆనడు. ఈ క్రమంలో ప్రియుడు దినేశ్‌తో కలిసి భవానీ అతడిని చంపడానికి ప్లాన్ వేసింది. అందులో భాగంగా జూలై 21వ తేదీన దినేశ్ ఇచ్చిన పురుగుల మందును భవానీ బిర్యానీ లో కలిపి భర్తకు వడ్డించాడు. దీంతో తరణిధరన్ అస్వస్థతకు గురయ్యాడు. కానీ చనిపోలేదు. బెడిసికొట్టడంతో మరో ప్లాన్ వేసింది. అస్వస్థతకు గురయి ఇంట్లో నీరసించి తరణిధరన్ నిద్రించగా ఆ సమయంలో దినేశ్‌ను భవానీ ఇంటికి పిలిపించింది. నిద్రపోతున్న తరణిధరన్ ను భవాని ప్రియుడు దినేశ్‌తో కలిసి దుప్పటితో గొంతు నులిమి చంపేసింది.
అయితే భర్తను చంపేసిన విషయం తెలియకుండా మరో ప్లాన్ వేశారు. లాక్ డౌన్ కారణంగా విపరీతంగా అప్పులు చేసి అవి తీర్చలేక తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని భార్య భవానీ పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు ఇంటిని పరిశీలించి తరణిధరన్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేయించారు. పోస్టుమార్టం రిపోర్ట్‌లో తరణిధరన్ ఆత్మహత్య చేసుకోలేదని.. విషం పెట్టి గొంతు బిగించి చంపేశారని తేలింది. దీంతో పోలీసులు భార్య భవానిని అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం విషయం తెలిపింది. ప్రియుడు దినేశ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో మరో ముగ్గురికి వివాహేతర సంబంధం ఉంది. ఈ ఘటనతో వారు ముగ్గురు పరారీలో ఉన్నారు. ఈ విధంగా వివాహేతర సంబంధం ఒకరి హత్యకు దారి తీయగా ఆమె జైలుపాలవడం.. ఇద్దరు పిల్లలకు దిక్కు ఎవరు?