Begin typing your search above and press return to search.
ప్రేమపెళ్లి..భర్త పై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య?
By: Tupaki Desk | 13 March 2020 8:00 AM GMTఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన కొత్తలో దంపతులు అంటే ఇలానే ఉండాలి అని , వారిని చూసిన చాలామంది అనుకునేవారు. కానీ , కొన్ని రోజులకే వారి మధ్య మనస్పర్ధలు మొదలైయ్యాయి. ఆ మనస్పర్థలు పెరిగి చివరికి , ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే నిద్రపోతున్న సమయంలో పెట్రోలు పోసి చంపేందుకు దోహదపడింది. ఈ దారుణమైన ఘటన తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో జరిగింది. ప్రేమించి , ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకున్న భర్తను దారుణంగా ఇలా పెట్రోల్ పోసి కడతేర్చడం గమనార్హం. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ దారుణానికి ఆమె ఒడిగట్టినట్టు తెలుస్తుంది.
ఇల్లెందు పట్టణంలోని వినోబాకాలనీలో నివాసం ఉంటున్న నక్కా కల్యాణ్ కొన్నేళ్ల క్రితం నిజాంపేటకు చెందిన శైలజను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. కల్యాణ్ ది ఖమ్మం జిల్లా కాగా - శైలజ ది హైదరాబాద్ లోని నిజాంపేట. ఇల్లెందులో నివశిస్తున్న వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొన్నాళ్లుగా భార్యాభర్తకు పడడం లేదు. ఇరుగుపొరుగు వాళ్లు కూడా వీళ్లిద్దర్ని మందలించారు. అలాగే రెండు మూడు సార్లు ... కుటుంబ సభ్యుల మధ్య కూడా పంచాయతీ జరిగింది. అయిన చెప్పిన రెండు రోజులు కలిసి ఉంటారు, ఆ తరువాత మళ్లీ మాములే.
ఇలా పలుమార్లు ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండటంతో శైలజ కఠిన నిర్ణయం తీసుకుంది. తన భర్త కళ్యాణ్ ను కడతేర్చాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి 2 గంటలకు పథకం ప్రకారం.. నిద్రిస్తున్న భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. మంటలకు తాలలేక కళ్యాణ్ కేకలు పెట్టుకుంటూ ఇంటి బయటకు పరుగులు పెట్టాడు. శైలజ కూడా అరుస్తూ కేకలు వేసింది. చుట్టుపక్కల వారు గమనించి మంటలు ఆర్పేశారు. కానీ, అప్పటికే అతడు తీవ్రంగా కాలిపోయాడు. బాధితుడిని వెంటనే ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్ లో దాదాపు 5 గంటల పాటు మృత్యువు తో పోరాడిన కల్యాణ్ ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. శైలజను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.