Begin typing your search above and press return to search.
డిప్యూటీ కలెక్టర్ గా కల్నల్ సంతోష్ భార్య !
By: Tupaki Desk | 21 Jun 2020 11:10 AM GMTభారత్, చైనా సరిహద్దులోని గాల్వాన్ లోయలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్న తెలంగాణ ప్రభుత్వం తన మాటని నిలబెట్టుకోవడంలో తోలి అడుగు ముందుకు వేసింది. కల్నల్ సంతోష్ కుటుంబానికి పరిహారం, ఆయన భార్య సంతోషికి ప్రభుత్వ ఉద్యోగంపై సర్కారు అధికార ఉత్తర్వులను సిద్ధం చేసింది.
ముఖ్యమంత్రి విచక్షణాధికారాలతో ఎవరినైనా గ్రూప్-1 స్థాయి దాకా ఉన్న పోస్టుల్లో నియమించే అవకాశం ఉంది. ఆ అధికారంతోనే సంతోషిని డిప్యూటీ కలెక్టర్ గా నియమించనున్నారు. సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం కేసీఆర్ సోమవారం సూర్యాపేట వెళ్లనున్నారు. ఈ సందర్భంగానే సంతోషికి నియామక ఉత్తర్వులను స్వయంగా అందజేయనున్నారు. అలాగే, హైదరాబాద్ జిల్లా షేక్ పేటలో 500 గజాల స్థల కేటాయింపు జీవో కాపీతోపాటు రూ.5కోట్ల చెక్కును అందించనున్నారు.
దేశం కోసం ప్రాణాలర్పించిన అమరుల కుటుంబాలకు ఎంత చేసినా తక్కువే అవుతుందని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పరిహారానికి తోడు రాష్ట్రాలు కూడా ఆదుకున్నప్పుడే సైనికుల కుటుంబాలకు భరోసా కల్పించినట్లుగా ఉంటుందని సీఎం కేసీఆర్ ఇదివరకే స్పష్టం చేశారు. కల్నల్ కుటుంబానికి రూ.5 కోట్ల ఆర్థిక సాయం, ఇంటి స్థలం ఇస్తామన్న ప్రభుత్వం.. ఆ మేరకు జీవోలన కూడా సిద్ధం చేసింది. కల్నల్ సంతోష్ బాబు అస్థికలను కృష్ణా-మూసీ నదీ సంగమంలో నిమజ్జనం చేశారు. సూర్యాపేట జిల్లా దామరచర్ల మండలంలోని వాడపల్లి వద్ద.. కృష్ణా, మూసీ నదులు కలిసే చోట పూజల అనంతరం కుటుంబీకులు మర పడవల్లో వెళ్లి అస్థికలను నిమజ్జనం చేశారు. జాతీయ జెండాలు చేతబట్టుకున్న జనం.. దారి పోడవునా కల్నల్ కుటుంబంపై పూలు చల్లుతూ, అమరుడి ఆత్మకు శాంతికలగాలని నినాదాలు చేశారు
ఒకవైపు వైపు భర్తను కోల్పోయినా, దేశ సేవకోసం తన పిల్లల్ని సైతం పంపుతానని కల్నల్ సంతోష్ భార్య సంతోషి ధీమాగా చెప్పారు. తమ కుటుంబానికి అండగా నిలిచిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. పలు మీడియా సంస్థలతో ఆమె మాట్లాడారు. ‘‘నా భర్త(సంతోష్) పిల్లల్ని చాలా బాగా చూసుకునేవారు. వాళ్లకు రోల్ మోడల్ గా నిలిచారు. మా పిల్లలు పెద్దవారయ్యాక.. ఆర్మీలో చేరానంటే సంతోషంగా పంపుతాను. పిల్లల గురించి మేమిద్దరం ఎన్నో కలలు కన్నాం. కానీ అంతలోనే ఇలా జరిగిపోయింది..''అని సంతోషి కన్నీటిపర్యంతమయ్యారు