Begin typing your search above and press return to search.
భర్త చేసిన ద్రోహానికి భార్యను చంపేశారు!
By: Tupaki Desk | 31 Jan 2020 10:05 AM GMTతమ కుమార్తె పుట్టినరోజు అని చెప్పి.. 23 మంది పిల్లల్ని.. మహిళల్ని ఇంటికి పిలిచి.. వారిపై దాడి చేయటమే కాదు.. వారందరిని ఇంట్లోని ఒక గదిలో బంధించిన వైనం యూపీలో చోటు చేసుకున్నది తెలిసిందే. గ్రామస్తులు తనపై హత్య కేసు నమోదు కావటంపై కోపం పంచుకున్న అతడు.. కుమార్తె పుట్టిన రోజు పేరుతో పార్టీ అని చెప్పి.. వారిని కిడ్నాప్ చేశాడు.
అంతేకాదు.. తమ వాళ్ల కోసం వచ్చిన పిల్లలు.. మహిళల కుటుంబ సభ్యులపైన అతడు ఉన్మాదిగా వ్యవహరిస్తూ కాల్పులు జరపటం.. బాంబు విసిరాడు. దీంతో.. రంగప్రవేశం చేసిన ప్రత్యేక భద్రతా బలగాలు.. అతడ్ని హతమార్చి.. పిల్లల్ని.. మహిళల్ని రక్షించారు. దాదాపు తొమ్మిది గంటల పాటు సాగిన ఆపరేషన్లో ఎవరికీ ఏమీ కాకుండా కథ సుఖాంతం కావటంపై అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఆపరేషన్ పై రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ప్రశంసలు కురిపించారు.
ఇదిలా ఉంటే.. తమను మోసం చేశాడన్న కోపంతో ఉన్న గ్రామస్థులు.. ఉన్మాది భార్యపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆమెకు పెద్ద ఎత్తున గాయాలయ్యాయి. దీంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆమెకు చికిత్స జరుగుతున్న సమయంలోనే గాయాల తీవ్రతతో ప్రాణాలు కోల్పోయారు. భద్రతా సిబ్బంది తమ వారిని రక్షించిన అనంతరం.. ఉన్మాది భార్యను అక్కడి స్థానికులు రాళ్లతో దాడి చేశారు. దీంతో ఆమె తీవ్ర గాయాలకు గురయ్యారు. భర్త చేసిన తప్పుడు పనికి భార్యగా ఆమె ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని చెప్పక తప్పదు.