Begin typing your search above and press return to search.

భర్త శృంగారపిచ్చి విసిగి ఆ భార్య ఏం చేసిందంటే?

By:  Tupaki Desk   |   20 May 2020 2:45 AM GMT
భర్త శృంగారపిచ్చి విసిగి ఆ భార్య ఏం చేసిందంటే?
X
ఇంతటి నిర్బంధ కాలంలో పెళ్లి చేసుకుంటే ఎంతటి అనర్థాలు చోటుచేసుకుంటాయో తెలిపే సంఘటన బెంగళూరులో కళ్లకు కట్టింది. అసలే మహమ్మారి దెబ్బకు దేశమంతా ఇంటికే పరిమితిమైంది. ఇలాంటి టైమ్ లో తక్కువ మందితో నిబంధనలు పాటిస్తూ ఇటీవలే ఓ జంటకు పెళ్లి చేశారు. కొత్తగా పెళ్లి అయ్యింది. ఎన్నో ఆశలతో ఆ నవ వధువు కొత్త కాపురాన్ని మొదలు పెట్టింది.. భర్త బెంగళూరులోనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ప్రస్తుతం మహమ్మారి విజృంభణతో వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నాడు. బెంగుళూరులోనే ఒక కొత్త ప్లాట్ లో కొత్త కాపురం పెట్టారు. ఇంట్లో ఇద్దరే. పైగా నవదంపతులు. ఇక ఎంజాయ్ అనుకున్నారంతా.. కానీ ఆ భర్తకు శృంగార కోరికలు ఎక్కువ. దీంతో అసలు పని వదిలేసి భార్యతో అదే పని పెట్టుకున్నాడు.

కానీ పెళ్లైన వారం వరకు ఆ ఇల్లాలు భరించింది. కొత్త మురిపెం అనుకుంది కానీ.. భర్తలో అదే తీరు.. రోజూ 5 సార్లు శృంగారం కావాలని ఒత్తిడి. దీంతో ఆ భార్య మొదట్లో భాగానే అనుభవించింది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ భార్యకు టార్చర్ ఎక్కువైంది. పొద్దున్నే ఓసారి, బ్రేక్ ఫాస్ట్ అయ్యాక మరోసారి.. సాయంత్రం మరోసారి , ఆ తర్వాత రాత్రి 2 సార్లు కావడంతో ఆమెకు ఓపిక నశించింది. ఇన్ని సార్లు శృంగారం భరించలేనంటూ ఆ అమ్మాయి తన తల్లికి చెప్పి బోరుమంది. కానీ తల్లి సుఖపెడుతున్న అల్లుడితో బాగా ఊండు అని గడ్డిపెట్టిందట.. అల్లుడినే వెనుకేసుకొచ్చిందట.. భర్తతో కలిసి కాపురం చేసుకో అని ఫోన్లో హితవు పలికిందట..

రోజురోజుకు భర్తలో శృంగారవాంఛ ఎక్కువై పోవడం.. రాత్రి, పగలు తేడా లేకుండా శృంగారం అంటూ చేస్తుండడంతో భార్య ఓపిక నశించింది. ఈ శృంగార భర్త వద్దంటూ తాజాగా బెంగళూరు పోలీసులను ఆశ్రయించింది. బెంగళూరులో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే పోలీసులు మాత్రం భార్యను శృంగారానికి బలవంతపెట్టే భర్తలను ఏం చేయలేమని.. కేసులు కూడా పెట్టలేమని.. కొత్తలో అలానే ఉంటుందని... ఇష్టం లేకపోతే విడిపోండని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం కొసమెరుపు.. దీంతో భర్త వద్దకు వెళ్లకుండా ఆ నవ వధువు తల్లిదండ్రుల వద్దకు వెళ్లిందట.. ఇలా కామకోరికల నవ వరుడు మాత్రం భార్య చేసిన పనికి షాక్ అయిపోయాడు.