Begin typing your search above and press return to search.
భార్య లాక్ డౌన్ లో..భర్త మాజీ ప్రేయసిని పెళ్లాడేశాడు
By: Tupaki Desk | 19 April 2020 8:30 AM GMTలాక్ డౌన్ కారణంలో మునుపెన్నడూ చూడని పరిస్థితులు చూస్తున్నాం. అనేక బాధలు పడుతున్నాం. ఎన్నో వింతలు - విశేషాలు చూస్తున్నాం. బీహార్ లో లాక్ డౌన్ పుణ్యమా అని ఊహించని పరిణామం ఒకటి చోటు చేసుకుంది. తన పుట్టింటికి వెళ్లిన ఓ మహిళ.. లాక్ డౌన్ కారణంగా అక్కడే ఉండిపోవాల్సి రాగా.. ఈ ఖాళీలో భర్త తన మాజీ ప్రేయసితో టచ్ లోకి వెళ్లాడు. ఆమెను పెళ్లి కూడా చేసుకున్నాడు. చివరికి విషయం బయటపడేసరికి అతను అరెస్టయి పోలీస్ స్టేషన్ లో ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. బీహార్ లోని పాలిగంజ్ లో ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఈ పట్టణానికి చెంది ధీరజ్ కుమార్ కు కొన్ని నెలల కిందటే పెళ్లి జరిగింది. లాక్ డౌన్ అమలుకు ముందు అతడి భార్య డల్హిన్ బజార్ లోని పుట్టింటికి వెళ్లింది.
ఆమె తిరిగి భర్త దగ్గరికి వద్దామని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చేసేది లేక పుట్టింటికే పరిమితం అయింది. ధీరజ్ భార్యను తన దగ్గరికి రావాలని గట్టిగా పట్టుబట్టాడు. కానీ ఆమె రాలేకపోయింది. ఐతే కొన్ని రోజులకే అతను తన మాజీ ప్రేయసితో రాయబారం నడిపి ఆమెను పెళ్లి చేసేసుకున్నాడు. దీని గురించి తెలుసుకున్న భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ధీరజ్ ను పోలీసులు అరెస్టు చేసి కేసు విచారిస్తున్నారు. ధీరజ్ అయిష్టంగానే పెళ్లి చేసుకున్నాడని.. భార్య దూరంగా ఉన్న సమయంలో మాజీ ప్రేయసి టచ్ లోకి వచ్చి ఇద్దరి మధ్య మళ్లీ బంధం బలపడిందని.. దీంతో భవిష్యత్ పరిణామాల గురించి ఆలోచించకుండా ఆమెను పెళ్లాడేశాడని పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసును చివరికెలా పరిష్కరిస్తారో చూడాలి మరి.