Begin typing your search above and press return to search.

భార్య నగ్నచిత్రాలు స్నేహితులకు పంపిన భర్త.. నీచమైన కోరిక

By:  Tupaki Desk   |   15 May 2020 11:30 PM GMT
భార్య నగ్నచిత్రాలు స్నేహితులకు పంపిన భర్త.. నీచమైన కోరిక
X
జీవితాంతం తోడుగా ఉంటానని పెళ్లినాడు బాస చేసిన భర్త.. ఆ భార్య పాలిట రాక్షసుడిగా మారాడు. ఆమె మానాన్ని నడిబజారులో అమ్మకానికి పెట్టాడు. ఏ భర్త చేయకూడని పని చేసి సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేశాడు. భార్య నగ్న చిత్రాలను స్నేహితులకు పంపి వారి లైంగిక కోరికలు తీర్చాలని వేధించాడు. దీంతో భర్త వేధింపులు తట్టుకోలేక ఆ ఇల్లాలి ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్ లో భర్త అరాచకాలను కళ్లకు కట్టింది.

రాజస్థాన్ కు చెందిన ఓ జంటకి ఏడాది కిందట వివాహమైంది. కొద్దికాలం బాగానే చూసుకున్న భర్త క్రమంగా తన పైశాచికత్వాన్ని బయటపెట్టాడు. భార్యతో నగ్నంగా శృంగారం చేసినప్పుడు తీసిన ఆమె నగ్న చిత్రాలను స్నేహితులకు పంపాడు. వారి కోరికలు తీర్చాలని వేధించాడు. కొన్నాళ్లుగా భర్త వేధింపులను భార్య భరిస్తూ వస్తోంది.

కానీ భర్తలో మార్పు రాకపోవడం.. ఎంత ప్రయత్నించినా వినకపోవడం.. వేధింపులు ఎక్కువ కావడంతో కుమిలిపోయిన భార్య ఆత్మహత్య చేసుకుంది.చనిపోయే ముందు భర్త దురాగతాలను సూసైడ్ నోట్ లో రాసింది.

పోలీసులు సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకొని ఆ భర్తను అరెస్ట్ చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు, స్థానికులు ఆమె మృతదేహంతో ఆందోళన చేశారు.