Begin typing your search above and press return to search.
తొలి కన్నీటి అభినందన
By: Tupaki Desk | 9 March 2017 6:28 PM GMTఅమెరికాలో మారిన పరిస్థితుల వల్ల జాత్యాహంకారుల చేతిలో హత్యకు గురైన తెలుగు ఎన్నారై శ్రీనివాస్ కూచిబొట్ల మరోమారు వార్తల్లో నిలిచారు. మార్చి 9వ తేదీన ఆయన పుట్టినరోజు. శ్రీనివాస్ జీవించి ఉంటే ఇవాళ్టికి ఆయన వయస్సు 33 ఏళ్లు నిండేవి. ఈ లోకంలో లేని, తన మనసులో ఉన్న తన భర్తకు శ్రీనివాస్ సతీమణి సునయన దుమల శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు ఫేస్ బుక్‌లో ఒక పోస్ట్ పెట్టి భర్తపై తనకున్న వెలకట్టలేని ప్రేమను చాటుకుంది.
"నా ప్రియమైన ప్రేమకు జన్మదిన శుభాకాంక్షలు. ఈ రూపంలో నీకు శుభాకాంక్షలు చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు. నిన్ను చాలా కోల్పోతున్నాను. కొత్త నివాసంలో నువ్వు చుట్టుపక్కల ఉన్న ఆహ్లాదకరమైన మనుషులు, పరిస్థితుల మధ్య సంతోషంగా ఉన్నావని భావిస్తున్నాను. నీ చుట్టూతా ప్రేమను మాత్రమే పంచే మనుషులు ఉన్నారని భావిస్తున్నాను. నీపై అపరిమత ప్రేమను కలిగిఉన్నాను." అని సునయన పోస్ట్ చేశారు.
కాగా, శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ప్రతి పుట్టినరోజు నాడు తమతో మాట్లాడటమే కాకుండా వీడియో కాల్ ద్వారా ఆశీస్సులు తీసుకునేవాడని శ్రీనివాస్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన జన్మదిన వేడుకలను తన జ్ఞాపకాలతోనే ఆ కుటుంబం గడిపేస్తోంది. ఇదిలాఉండగా శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా తెలంగాణ ఎన్నారై పేరెంట్స్ అసోసియేషన్, ఆల్ ఇండియా పీస్& సాలిడారిటీ ఆర్గనైజేషన్ కలిసి సంయుక్తంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించాయి. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద గురువారం సాయంత్రం ఈ కార్యక్రమం చేపట్టాయి.