Begin typing your search above and press return to search.

సీఐఏ వికృత రూపాన్ని బ‌య‌ట‌పెట్టిన వికీలీక్స్‌

By:  Tupaki Desk   |   8 March 2017 10:43 AM GMT
సీఐఏ వికృత రూపాన్ని బ‌య‌ట‌పెట్టిన వికీలీక్స్‌
X
అమెరికా ఆర్మీ చేస్తున్న అకృత్య ర‌హ‌స్యాల‌ను గ‌తంలో బ‌య‌ట‌పెట్టిన వికీలీక్స్ ఈసారి ఏకంగా ఆదేశ ఇంటెలిజెన్స్ సంస్థ అయిన సెంట్ర‌ల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ)పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. యాపిల్ ఫోనైనా - ఆండ్రాయిడ్ డివైస్ అయినా - స్మార్ట్ టీవీ అయినా - మీద‌గ్గ‌ర అత్యాధునిక ఎల‌క్ట్రానిక్ వ‌స్తువు ఏది ఉన్నా, వాటి ఆధారంగా మీ ర‌హ‌స్యాలు బ‌య‌ట‌పడే అవ‌కాశాలున్నాయట‌. హైటెక్ ఫోన్లు - టీవీల ద్వారా మీ ర‌హ‌స్య క‌ద‌లిక‌ల‌పై అమెరికాకు చెందిన సీఐఏ ఎప్పుడూ ఓ క‌న్ను వేస్తున్న‌ద‌ట‌. అగ్ర‌రాజ్యానికి చెందిన సెంట్ర‌ల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ప్ర‌పంచంలోని ప్ర‌తి ఒక్క‌రి క‌ద‌లిక‌ల‌ను స్కాన్ చేస్తోంద‌ని వికీలీక్స్ వెల్ల‌డించింది. ప్రతి ఒక్క‌రి ఫోన్‌ - టీవీల‌ను హ్యాక్ చేసే టెక్నాల‌జీ సీఐఏ ద‌గ్గ‌ర ఉంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఉన్నాయని వికీలీక్స్ ప్ర‌క‌టించింది.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న స‌మాచారాన్ని త‌న గుప్పిట్లో పెట్టుకోవాల‌నుకున్న సీఐఏ ఇందుకోసం ఊహించ‌ని సాఫ్ట్‌ వేర్ల‌ను తీర్చిదిద్దింది. ఈ సాఫ్ట్‌ వేర్ శామ్‌ సంగ్ స్మార్ట్ టీవీల‌ను కూడా హ్యాక్ చేయ‌గ‌ల‌ద‌ట‌. అదెలాగంటే...టీవీ ఫేక్‌-ఆఫ్ మోడ్‌ లో ఉంటుంది, దాని ద‌గ్గ‌ర ఉన్న వ్య‌క్తులు మాట్లాడే సంభాష‌ణ‌లు నేరుగా అమెరికా గూఢాచారుల‌కు వెళ్తాయ‌ట‌. ఐఫోన్లు - ఐప్యాడ్లు - ఆండ్రాయిడ్ డివైస్‌ ల నుంచి ర‌హ‌స్యంగా స‌మాచారాన్ని సేక‌రించే హ్యాకింగ్ టూల్స్ సీఐఏ ద‌గ్గ‌ర ఉన్న‌ట్లు వికీలీక్స్ ఆరోపించింది. సీఐఏ అంటే శ‌క్తివంత‌మైన హ్యాకింగ్ సంస్థ అంటూ కూడా వికీలీక్స్ వ్య‌వ‌స్థాప‌కుడు జూలియ‌న్ అసాంజే ఘాటైన ఆరోప‌ణ‌లు చేశారు.

అంతేకాకుండా వికీలీక్స్‌ మ‌రో సంచ‌ల‌న ఆరోప‌ణ చేసింది. సీఐఏ ద‌గ్గ‌ర ఉన్న హ్యాకింగ్ టెక్నాల‌జీని కొంద‌రు వ్య‌క్తులు దొంగ‌లించార‌ని కూడా వికీలీక్స్ మ‌రో విభ్రాంతిక‌ర ప్ర‌క‌ట‌న చేసింది. నేర‌స్తులు, విదేశీ గూడాచారుల వ‌ద్ద ఆ హ్యాకింగ్ టెక్నాల‌జీకి సంబంధించిన టూల్స్ ఉన్న‌ట్లు కూడా నివేదిక పేర్కొంది. హ్యాకింగ్ టూల్స్ నేర‌స్తుల చేతుల‌కు వెళ్ల‌డాన్ని అమెరికా రాజ‌కీయ‌వేత్త‌లు సీరియ‌స్‌గా ప్ర‌శ్నిస్తున్నారని తెలిపింది. సీఐఏ నిర్వ‌హించిన హ్యాకింగ్ ప్రోగ్రామ్‌ కు సంబంధించిన టెక్నాల‌జీ ఎలా చౌర్యానికి గురైంద‌న్న విష‌యాన్ని త‌మ ప్ర‌చుర‌ణ‌లో వెల్ల‌డించిన‌ట్లు వికీలీక్స్ వివ‌రించింది. నేర‌స్తుల చేతుల్లోకి హ్యాకింగ్ టెక్నాల‌జీ వెళ్ల‌డం వ‌ల్ల సైబ‌ర్ ఆయుధాలు త‌యారు చేయ‌డం క‌ష్టంగా ఉంటుంద‌ని అసాంజే తెలిపారు. కాగా, మ‌రోవైపు యాపిల్ సంస్థ మాత్రం త‌మ ఫోన్ల‌ను హ్యాక్ చేసే టెక్నాల‌జీ ఏదీ లేదని తెలిపింది. సీఐఏ హ్యాకింగ్ అంశంపై వికీలీక్స్‌ కు ఎక్క‌డ నుంచి స‌మాచారం అందిన‌ద‌న్న విష‌యాన్ని మాత్రం అమెరికా అధికారులు దృవీక‌రించ‌లేక‌పోతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/