Begin typing your search above and press return to search.
మనుషుల్ని చంపేస్తున్న అమెరికా కార్చిచ్చు
By: Tupaki Desk | 22 Aug 2015 12:55 AM GMTప్రపంచానికే పెద్దన్న లాంటి అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం ఇప్పుడు ప్రకృతి ప్రకోపంతో విలవిలలాడిపోతోంది. కొద్ది రోజులుగా ఆడవుల్లో మొదలైన కార్చిచ్చు.. దావనంలా మారి.. ఆడువుల్ని మాడి మసి చేసేస్తుంది.
ఈ మంటల్ని అదుపు చేయటానికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బందిలో ముగ్గురు మరణించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఇట్టే తెలుస్తుంది. అంతేకాదు.. అడవుల్లో మొదలైన ఈ కార్చిచ్చు.. వేగంగా పట్టణాల దిశగా విస్తరించటంతో అమెరికన్లు వణికిపోతున్నారు. ఏం చేయాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
ఇప్పటివరకూ దావాగ్ని కారణంగా మొత్తం 13 మంది మరణించారు. పరిస్థితి అంతకంతకూ విషమంగా మారటంతో వాషింగ్టన్ లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. భారీగా ఎగిసిపడుతున్న మంటల్ని అదుపులోకి తీసుకొచ్చి.. ఆర్పేందుకు అమెరికాలోని అగ్నిమాపక సిబ్బందితో పాటు.. ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్ కు చెందిన బృందాలతో పాటు మొత్తం 29 వేల మంది అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నరంటే.. మంటల తీవ్రత ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తుంది. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు భారీ సంఖ్యలో హెలికాఫ్టర్లను వినియోగిస్తున్నారు.
ఈ భారీ కార్చిచ్చు కారణంగా ఇప్పటివరకూ 13 మంది మరణించటంతో పాటు.. పెద్ద ఎత్తున ఇళ్లు ఆగ్నికి ఆహుతి అయిపోతున్నాయి. లక్షలాది వృక్షజాతి నాశనమైపోవటంతోపాటు.. వేలాది హెక్టార్లు మాడి మసైపోతున్న దుస్థితి.