Begin typing your search above and press return to search.
కాలిఫోర్నియాలో కార్చిచ్చు..లక్ష మంది తరలింపు!
By: Tupaki Desk | 7 Dec 2017 9:59 AM GMTకాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చు `స్కిర్ బాల్` తీవ్ర రూపం దాల్చింది. దక్షిణ కాలిఫోర్నియాలోని పలు ప్రాంతాలతో పాటు, లాస్ ఏంజిలెస్ ను అగ్ని కీలలు శరవేగంగా చుట్టుముడుతున్నాయి. దీంతో, ఆ ప్రాంతాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు - అగ్నిమాపక శాఖ సిబ్బంది తరలిస్తున్నారు. కార్చిచ్చు ధాటికి బెల్ ఎయిర్ ప్రాంతంలోని చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీంతో, ఆ ప్రాంతం నుంచి దాదాపు లక్షలాది మంది ప్రజలను బుధవారం తరలించారు. బెల్ ఎయిర్ లోని ఇదే ప్రాంతం 1961 లో కార్చిచ్చు ధాటికి ధ్వంసం అయింది. 350 మంది ఫైర్ ఫైటింగ్ సిబ్బంది - 52 ఫైర్ ఇంజన్లు - 6 ఫిక్స్ డ్ వింగ్ ఎయిర్ క్రాఫ్ట్ లు నిరంతరాయంగా పనిచేయడంతో బెల్ ఎయిర్ లో అగ్ని కీలలు అదుపులోకి వచ్చాయి.
కార్చిచ్చు పలు ప్రాంతాలకు వేగంగా వ్యాపిస్తుండడంతో అధికారులు పలు రహదారులను ముందు జాగ్రత్త చర్యగా మూసి వేశారు. మంగళవారం నాడు `థామస్` కార్చిచ్చు వల్ల వెంచురా నగరం ధ్వంసమైంది. ఆ ప్రాంతంలోని ఆయిల్ ఫీల్డ్ ల గుండా ఈ కార్చిచ్చు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ కార్చిచ్చు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు ఆ ప్రాంతాలలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. అగ్ని కీలలను పూర్తి స్థాయిలో అదుపులోకి తెచ్చేందుకు అగ్ని మాపక శాఖ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలిపారు. అధకారులు అప్రమత్తంగా వ్యవహరించి తక్షణమే స్పందించడంతో ఈ కార్చిచ్చును సకాలంలో అదుపులోకి తేగలిగారు.