Begin typing your search above and press return to search.
అఖిలప్రియ అండ్ కో తీరు మారదా? మళ్లీ మరో కేసులో బుక్
By: Tupaki Desk | 7 July 2021 7:40 AM GMTతప్పు ఒకసారి జరిగితే అయ్యో పాపం.. పొరపాటున చేశారేమో అనుకోవచ్చు. అదే పనిగా తప్పులు చేస్తే.. లేనిపోని తిప్పలు ఖాయం. ఈ విషయాన్ని ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు ఆమె భర్తకు అర్థమైనట్లుగా అనిపించట్లేదు. భూమి వివాదానికి సంబంధించి తన తండ్రికి ఒకప్పుడు బాగా దగ్గరైన ప్రవీణ్ రావు సోదరుల్ని కిడ్నాప్ చేసిన వైనం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచనలంగా మారిన సంగతి తెలిసిందే. వందల కోట్ల రూపాయిలు విలువ చేసే భూమికి సంబంధించిన విషయంలో పంచాయితీ స్థాయి దాటిపోయి.. అనూహ్యంగా కిడ్నాప్ చేయటం.. ఆ వెంటనే పోలీసులు రంగంలోకి దిగటం తెలిసిందే.
మొత్తంగా సదరు ఎపిసోడ్ లో అడ్డంగా బుక్ అయ్యింది మాత్రం భూమా అఖిలప్రియ అండ్ కో అనే మాట బలంగా వినిపిస్తూ ఉంటుంది. భూమి తమదే అయినప్పటికీ.. ప్రవీణ్ రావు తమ సొంతం చేసుకునే ప్రయత్నం చేసినట్లుగా భూమా వర్గం వాదిస్తున్నా.. అందుకు తగ్గ ఆధారాలు సరిగా లేవన్న మాట వినిపిస్తూ ఉంటుంది. కిడ్నాప్ కేసు విచారణ కోసం జులై 3న కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే.. అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్.. సోదరుడు జగత్ విఖ్యాత్ లు గైర్హాజరు అయ్యారు.
కోర్టుకు రాలేకపోవటానికి సరైన కారణం చెప్పాల్సింది పోయి.. అందుకు భిన్నంగా నకిలీ సర్టిఫికేట్ ను న్యాయస్థానానికి ఇచ్చి అడ్డంగా బుక్ అయ్యారు. కిడ్నాప్ కేసు విచారణ కోసం హాజరు కావాల్సిన వేళ.. తనకు.. తన బావమరిదికి కోవిడ్ తో ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నారు. అక్కడితో ఆగకుండా ఫ్రూప్ పేరుతో నకిలీ ధ్రువపత్రాల్ని అందజేశారు. అయితే.. అవన్నీ నకిలీవి అన్న విషయాన్ని గుర్తించారు. తమకు అందిన ఫిర్యాదు ఆధారంగా వారు అందజేసిన పత్రాల్నిచెక్ చేయగా.. అవన్నీ నకిలీవిగా తేలింది. దీంతో బోయిన్ పల్లి పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.
అంతేకాదు.. నకిలీ ధ్రువపత్రం జారీ చేసిన ఆసుపత్రికి వెళ్లిన పోలీసులు అక్కడ విచారణ జరిపారు. అక్కడి సిబ్బంది ఇచ్చిన సమాచారం ఆధారంగా అవన్నీ నకిలీ సర్టిఫికేట్లుగా తేల్చారు. ఇప్పుడున్న కిడ్నాప్ కేసు సరిపోదన్నట్లు.. తాజాగా నకిలీ పత్రాల కేసు వారికి చుట్టుకుందని చెప్పాలి. నిజానికి.. అఖిలప్రియకు వ్యతిరేకంగా ఉన్న ప్రవీణ్ రావు అండ్ కోలు బలవంతులే కాదు.. ఇలాంటి తప్పుల్ని ఇట్టే పసిగట్టే టాలెంట్ వారి సొంతం. అలాంటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సింది పోయి.. ఇలాంటి యేషాలతో మరిన్ని సమస్యలు తప్పవన్న మాట వినిపిస్తోంది.