Begin typing your search above and press return to search.
జనసేనకు అల్లు కుటుంబం సపోర్ట్ చేస్తుందా....?
By: Tupaki Desk | 23 Nov 2022 6:30 AM GMTఏపీలో జనసేన ఇపుడు కాకపోతే మరెప్పుడు అంటోంది. నిజానికి జనసేనకు ఏపీలో జనాదరణ ఎంత ఉంది అన్నది పక్కన పెడితే పవన్ మీదనే పూర్తిగా ఆధారపడి ఆ పార్టీ ముందుకు సాగుతోంది. పవన్ కళ్యాణ్ గ్లామర్ రక్షణ కవచంగా ఉంది. ఇక మెగాభిమానం ఎటూ ఉంది. మెగా ఫ్యామిలీ ఎన్నికల ముందు అంతా కలసి ప్రచారం చేస్తారని ఒక వైపు వినిపిస్తోంది. దాంతో ఏపీ రాజకీయాలలో కీలకమైన మార్పును జనసేన తీసుకువస్తుంది అని అంటున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే ఒకనాడు ప్రజారాజ్యం పార్టీ స్థాపనలో నిర్వహణలో అన్నీ తాను అయి వ్యవహరించిన ప్రముఖ సినీ నిర్మాత చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ జనసేనలో ఏమైనా కీలక పాత్ర పోషిస్తారా అన్న చర్చ కూడా వస్తోంది. అల్లు అరవింద్ ని మేనేజ్మెంట్స్ స్కిల్స్ లో గొప్పగా చెప్పుకుంటారు. ఆయన నిర్వహణ సామర్ధ్యం మీద మెగాస్టార్ కి చాలా హోప్స్ ఉండేవని అంటారు. ఆయన ఉంటే చాలు అన్న నమ్మకం చిరంజీవికి ఎపుడూ ఉంది. అలాంటి అరవింద్ ని జనసేన తన పార్టీ సేవల కోసం ఉపయోగించుకుంటుందా అన్నదే చర్చగా ఉంది.
ఇక జనసేనకు తీసుకుంటే పవన్ ఒక్కడే ఏమీ చూసుకోలేడు. నాగబాబు తోడుగా ఉన్నా కూడా ఇంకా కావల్సిన మద్దతు ఎంతో ఉంది. అందుకే మెగా ఫ్యామిలీతో పాటు సినీ రంగాన ధీటైన మరో ప్రముఖ సినీ ఫ్యామిలీగా ఉన్న అల్లు అరవింద్ ఫ్యామిలీ మద్దతు కూడా జనసేనకు ఉంటుందా అన్న చర్చ అయితే ముందుకు వస్తోంది. అయితే ఈ విషయంలో చూస్తే అల్లు అరవింది కి జనసేనకు సపోర్ట్ చేయాలని ఉన్నా కూడా ప్రముఖ నటుడు అల్లు అర్జున్ అయితే పెద్దగా స్పందించడం లేదు అని అంటున్నారు.
ఒక విధంగా మెగా ఫ్యామిలీ మెగా చట్రం నుంచి అల్లు ఫ్యామిలీ ఈ మధ్యనే బయటపడుతోంది అని ప్రచారం కూడా ఉంది. దానికి కారణం అల్లు అర్జున్ అని చెబుతారు. నిజానికి ఫిల్మ్ ఇండస్ట్రీకి 1953లో అల్లు రామలింగయ్య వచ్చి జెండా పాతారు. ఆ తరువాత గీతా ఆర్ట్స్ ని 1974లో స్థాపించి అల్లు అరవింది నిర్మాతగా ఉన్నారు. ఆ మీదట చిరంజీవి ఇండస్ట్రీకి రావడం అల్లు ఫ్యామిలీతో అల్లుడుగా బంధం పెనవేసుకునిపోవడం జరిగింది.
అల్లు రామలింగయ్య కుటుంబానికి మెగా ఫ్యామిలీ తోడుగా ఉంది. అలాగే అల్లు ఫ్యామిలీ కూడా మెగా ఫ్యామిలీకి చేదోడు వాదోడుగా ఉంది. కానీ ఈ మధ్యనే అల్లు అరవింద్ అలీతో సరదాగా అన్న ప్రోగ్రాం లో చెప్పినవిధంగా చూస్తే పిల్లలు పెద్ద వాళ్ళు అయ్యారు వారి మధ్య వృత్తి పరమైన పోటీ ఉంది అని కూడా పేర్కొన్నారు.
మరి ఈ పోటీ మరింతగా పెరిగి ఎంతో కొంత గ్యాప్ అయితే వచ్చిందా అన్న చర్చ అయితే ఉంది. గతంలోలా మెగా ఫ్యామిలీతో అల్లు ఫ్యామిలీ రిలేషన్స్ లేవు అన్న ప్రచారం చేస్తున్న వారూ ఉన్నారు. ఇక ప్రజారాజ్యం పార్టీ ప్రయోగం విఫలం కావడానికి అల్లు అరవింద్ దానికి మూల కారకుండని ఆయన మీద అప్పట్లో విమర్శలు వచ్చాయి. వాటిని కూడా అల్లు ఫ్యామిలీ నవీన తరం సహించలేకపోయింది అని కూడా చెబుతారు.
ఎక్కడైనా విజయం దక్కిందే ఎవరినీ ఏమీ అనరు. పరాజయం వస్తే మాత్రం పట్టుకుని ఒకరినే టార్గెట్ చేస్తారు. ఆ విధంగా ప్రజారాజ్యం నాటి విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయని, దాని వల్లనే జనసేన పుట్టుకువచ్చింది అని కూడా అంటారు. మరి అరవింద్ రాకపోవడానికి కూడా ఇది ఒక కారణం అని చెప్పేవారు ఉన్నారు. వీటికి మించి అల్లు అర్జున్ లాంటి వారికి రాజకీయాల కంటే సినిమాలు చేసుకోవడమే బెటర్ అన్న భావన ఉంది అని చెబుతున్నారు.
తన తండ్రి విషయంలో ఆయన ఇదే రకమైన భావనతో ఉన్నారని అంటున్నారు. అందువల్లనే అరవింద్ ఇపుడు బయటపడలేకపోతున్నారు అని కూడా టాక్ నడుస్తోంది. ఇక అల్లు అరవింద్ వచ్చేసి, మెగా ఫ్యామిలీ మద్దతు ఇస్తే కచ్చితంగా అది మరో ప్రజారాజ్యం లాగానే ఉంటుందని, ఆ ఇంపాక్ట్ రేపటి రోజున పడి అనుకున్న రిజల్స్ట్స్ రాకపొతే మళ్ళీ నింద మోయాల్సి ఉంటుంది అన్న ఆలోచనలు కూడా అల్లు క్యాంప్ లో ఉన్నాయని కూడా చెప్పే వారు ఉన్నారు.
ఏది ఏమైనా చూస్తే మాత్రం అల్లు ఫ్యామిలీ ఈసారికి జనసేన ద్వారా పొలిటికల్ యాక్టివిటీలో వేలూ కాలూ పెట్టకపోవచ్చు అనే అంటున్నారు. మరీ కావాలనుకుంటే ఎన్నికల ముందు అల్లు అర్జున్ జనసేనకు పాజిటివ్ గా ప్రకటనలు ఏమైనా చేసే అవకాశాలు ఉండొచ్చు అని చెబుతున్నారు. చూడాలి మరి అల్లు క్యాంప్ నుంచి జనసేన వైపు ఎవరు వస్తారో. అసలు రారో అన్నది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.