Begin typing your search above and press return to search.
రాజు గారే కింగ్... మంత్రి గారు ఆయనేట
By: Tupaki Desk | 28 Dec 2022 9:30 AM GMTవిజయనగరం జిల్లా వరకూ చూస్తే పూసపాటి అశోక్ గజపతిరాజుకు ఎదురులేదు. ఆయన తండ్రి పీవీజీ కాలం నుంచి వాళ్ల ఇంట్లో రాజకీయం ఉంది. అంతకు ముందు సంస్థానాధీశులు. ఇక అశోక్ ది నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితం ఏడు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారిగా కేంద్రంలో రాష్ట్రంలో కీలక శాఖలకు మంత్రిగా రాజు గారు హవా చలాయించారు.
ఇక తాజాగా విజయనగరంలో చంద్రబాబు టూర్ సాగితే ఆయన వెన్నంటి అశోక్ ఉన్నారు. బాబు కూడా ఆయనకు ప్రయారిటీ ఇచ్చి రోడ్ షోలతో పాటు మీటింగ్స్ లో తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. విజయనగరం పర్యటనలో అశోక్ బంగ్లాలోనే బాబు బస చేయడం విశేషం.
ఇక విజయనగరం అసెంబ్లీ నుంచి రాజు గారిని మళ్ళీ పోటీ చేయించాలని బాబు ఆలోచిస్తున్నారుట. అశోక్ సైతం ఎంపీగా వెళ్ళేది లేదు అని అంటున్నారు. ఆయన తన కుమార్తె అతిధి గజపతిరాజుని రాజకీయంగా ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికలు టఫ్ గా జరుగుతాయి కాబట్టి విజయనగరం నుంచి అశోక్ ఎమ్మెల్యేగా పోటీలో ఉండడమే బెటర్ అని బాబు భావిస్తున్నారు అని తెలుస్తోంది.
ఇక ఎంపీగా అతిధి గజపతిరాజుకు టికెట్ ఇస్తారా అన్నది కూడా చూడాలని అంటున్నారు. మొత్తానికి చూస్తే అశోక్ ని ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే కచ్చితంగా మరోమారు ఆయన మంత్రి అవుతారని, కీలకమైన శాఖలను చేపడతారు అని ఆయన అనుచర వర్గం సంబరపడుతోంది.
ఇక విజయనగరం జిల్లాలో చంద్రబాబు పర్యటనలో అశోక్ వ్యతిరేక వర్గం సౌండ్ చేయకుండా అశోక్ అడ్డుకోవడంలో సక్సెస్ అయ్యారని అంటున్నారు. విజయనగరం ఎమ్మెల్యే టికెట్ అశోక్ కి కనుక ఇస్తే మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు చుక్కెదురే అని అంటున్నారు. ఆమె 2014లో తెలుగుదేశం తరఫున పోటీ చేసి గెలిచారు. 2019 నాటికి ఆమెకు టికెట్ దక్కలేదు. అయితే వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా తనకు టికెట్ దక్కుతుంది అని ఆమె ఆశిస్తున్నారు.
కానీ అశోక్ కే టికెట్ అని చంద్రబాబు జిల్లా టూర్ సందర్భంగా స్పష్టం కావడంతో మీసాల గీత ఏమి చేస్తారు అన్నది ఆసక్తిగా మారింది. ఆమె విజయనగరం లో అశోక్ కి వ్యతిరేకంగా పార్టీ రాజకీయాలను నడుపుతున్నారు. అశోక్ బంగ్లాకి వెళ్లకుండా ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ని ఏర్పాటు చేసి మరీ రాజా వారికి సవాల్ విసిరారు.
ఇక ఆమె వెళ్తే వైసీపీలోకి వెళ్లాలి లేకపోతే సైలెంట్ అవాలి అనే అంటున్నారు. వైసీపీలో కోలగట్ల వీరభద్రస్వామికి టికెట్ మరోసారి కన్ ఫర్మ్ అని అంటున్నారు. అయితే అశోక్ గజపతిరాజు పోటీకి దిగితే మాత్రం ఆయన్ని ఓడించేందుకు బీసీలకు కాపులకు చాన్స్ ఉండొచ్చు అని అంటున్నారు. అదే జరిగితే మీసాల గీతను వైసీపీలోకి తీసుకుంటారు అని అంటున్నారు. ఏది ఏమైనా అశోక్ కి ఎదురులేదని బాబు టూర్ లో మరోమారు రుజువు అయింది అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయమని, అశోక్ మంత్రి అవడం ఖాయమని కోట సాక్షిగా రాజా వారి అభిమానులు సంతోషపడుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.