Begin typing your search above and press return to search.

తిరుపతిలో బీజేపీ ‘గ్లామర్’ వర్కవుటవుతుందా ?

By:  Tupaki Desk   |   13 Jan 2021 12:30 AM GMT
తిరుపతిలో బీజేపీ ‘గ్లామర్’ వర్కవుటవుతుందా ?
X
తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో ఓట్లు రాబట్టేందుకు బీజేపీ సినీగ్లామర్ మీదే ఆధారపడినట్లుంది చూస్తుంటే. లేకపోతే ఇద్దరు సెలబ్రిటీలను కలవటానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు చెన్నైకి వెళ్ళటం ఏమిటి ? చెన్నైకి వెళ్ళిన వీర్రాజు వెటరన్ హీరోయిన్ వాణీ విశ్వనాధ్ తో భేటీ అయ్యారు. ఆమె పార్టీలో చేరితే క్రియాశీలక పదవి ఇస్తామంటూ ప్రతిపాదించారు. తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక బహిరంగ సభలోనే ఆ పదవిని ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.

వీర్రాజు ఇచ్చిన హామీలను గమనిస్తే ఆ పదవి ఏదో వాణికి చెప్పేఉంటారనటంలో సందేహం లేదు. కాకపోతే పార్టీ ప్రతిపాదించిన పదవిని అందుకోవటానికి ఆమె సుముఖంగా ఉన్నారా లేదా అన్నదే తేలాలి. సరే వ్యవహారం చూస్తుంటే ఆమె పార్టీలో చేరటం ఖాయమనే అనిపిస్తోంది. ఆమెకు ఏమి పదవి ఇస్తారు ? పార్టీకి ఆమె ఎంతగా ఉపయోగపడుతుందన్నది వేరే విషయం. ఆమె గతంలో టీడీపీతో కొంతకాలం రాసుకుపూసుకు తిరిగారు. మొన్నటి ఎన్నికల్లో నగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ తరపున పోటీ చేస్తారని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది.

నగిరి నియోజకవర్గంలో రోజాకు తనకే పోటీ అంటు అప్పట్లో ఆమె మీడియాకు కొన్ని ఇంటర్య్వూలు కూడా ఇఛ్చారు. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో ఇటు పార్టీ అటు వాణి సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత రాజకీయాలకే దూరమైపోయి మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళిపోయారు. ఏదో అడపా దడపా తెలుగు సినిమాల్లో చేస్తున్నా మనదగ్గరేమంత పాపులర్ కాదు. అలాంటి అవుట్ డేటెడ్ హీరోయిన్ ప్రాపకం కోసం వీర్రాజు ప్రయత్నించటమే ఆశ్చర్యంగా ఉంది.

వాణి స్వస్ధలం కేరళ రాష్ట్రం. ఆమెకు తెలుగు కూడా స్పష్టంగా రాదు. అలాంటి ఆమెతో తిరుపతి ఉపఎన్నికలో ప్రచారం చేయించుకోవాలని బీజేపీ తెగ ఆరాటపడుతోంది. తిరుపతి ఉపఎన్నికల్లో బీజేపీ గెలుపుకు ప్రచారం చేయాలని అద్యక్షుడు అడగటమే ఆశ్చర్యంగా ఉంది. అలాగే రాష్ట్రంలో పార్టీ అభివృద్ధికి కూడా వాణి ప్రచారం చేయాలట. సినీ గ్లామర్ ను వాడుకోదలచుకుంటే అందుకు తెలుగు సెలబ్రిటీలే చాలామందున్నారు. వాళ్ళందరినీ వదిలేసి తెలుగు సరిగా రాని వాణిని అడగటమే విచిత్రం. పనిలో పనిగా మరో అవుట్ డేటెడ్ హీరోయిన్ ప్రియారామన్ తో కూడా వీర్రాజు భేటీ అవుదామని అనుకున్నారు. అయితే కొన్ని అవాంతరాల వల్ల సాధ్యంకాక భేటీ వాయిదాపడింది.