Begin typing your search above and press return to search.

బీజేపీ ఎలక్షన్లలో ఆ సాఫ్ట్ వేర్ వాడుతుందా..?

By:  Tupaki Desk   |   16 March 2021 10:23 AM GMT
బీజేపీ ఎలక్షన్లలో ఆ సాఫ్ట్ వేర్ వాడుతుందా..?
X
భారతదేశంలో ఇప్పటి వరకు రెండు పార్టీలు మాత్రమే పరిపాలన సాగిస్తున్నాయి. వాటిలో ఒకటి కాంగ్రెస్, మరొకటి భారతీయ జనతా పార్టీ (బీజేపీ). రెండు పార్టీలు రెండు పర్యాయాలుగా అన్నట్లుగా అధికారంలో ఉంటున్నాయి. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ 2019లోనూ పీఠం చేజిక్కించుకుంది. అయితే రెండో పర్యాయంలో బీజేపీ రాజకీయాలను కాకుండా టెక్నాలజీని ఎక్కువగా నమ్ముతోంది. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దగ్గర ఉన్న సాంకేతిక విభాగం పరిపాలనలో ముఖ్య పాత్ర వహిస్తోందని తెలుస్తోంది. ఎన్నికల నుంచి ప్రభుత్వ పథకాల వరకు ఎలా చేయాలో ఈ విభాగం తెలుపుతున్నట్లు సమాచారం.

ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మూడో ప్లేసులో కూడా సరిగాలేని భారతీయ జనతా పార్టీ 48 వార్డుల్లో గెలిచి రెండో స్థానానికి వచ్చింది. అయితే హిందుత్వ వాదనతోనే ఇలా పట్టు సాధించిందని కొందరు అంటున్నారు. అయితే ఆ విజయం వెనుక మరొకటి నడిచిందన్న వార్త బయటకు వచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఒకరోజు ముందు బీజేపీ ఓటర్లకు వాట్సాప్ ద్వారా కొన్ని ఓటర్ స్లిప్పులను పంపిందట. ఆ స్లిప్పులపై బీజేపీ నినాదం ఉందట.

సాధారణంగా ఓటర్ స్లిప్పులపై ఎలాంటి రాజకీయ పార్టీకి సంబంధించిన నినాదాలు, గుర్తులు ఉండవు. అయితే ఈ స్లిప్పులు బయట పంచితే క్రిమినల్ కేసులు నమోదవుతాయి. అయితే బీజేపీ ఓ సాప్ట్ వేర్ ను ఉపయోగించి వీటిని పంపించిందట. అయితే వీటిని ఎవరు పంపించారు..? అన్న వివరాలు లేవట. కొందరు బీజేపీ నాయకులు ఇది తమ పని కాదని, ఎవరో కావాలనే చేశారని అంటున్నారు. అయితే ఎలక్షన్ కు సంబంధించి ఇలాంటి సాఫ్ట్ వేర్ లోకల్ పార్టీ ఉపయోగించదు. ఎందుకంటే ఇది ఎలక్షన్ రూల్ ప్రకారం విరుద్ధం. అందువల్ల ఇది నేషనల్ పార్టీయే చేసిందని కొందరు వాదిస్తున్నారు.

ఇక ఢిల్లీలో రైతులు చేస్తున్న ధర్నాను మోడీ దగ్గర ఉన్న సోషల్ మీడియా టీం హైలెట్ చేయడం లేదు. ఒకవేళ అందుకు సపోర్టు చేసినా వెంటనే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. అంటే మోడీకి వ్యతిరేకంగా ఏ చిన్న పోస్టు వచ్చినా వాటిపై చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది ఆ సోషల్ టీం. ఇలా బీజేపీ టెక్నాలజీని ఉపయోగించుకొని ముందుకు వెళ్తోంది.