Begin typing your search above and press return to search.
బీజేపీకి ప్రచారం చేస్తా.. కానీ.. జీవిత షరతు!?
By: Tupaki Desk | 14 Sep 2022 1:30 AM GMTరాజకీయాలకు సనీరంగానికి అవినాభావ సంబంధాన్ని ఎవరూ తోసిపుచ్చలేరు. ఎప్పటి నుంచి రాజకీయాలు-సినీ రంగం పాలునీళ్లలా కలిసిపోయాయి. ప్రత్యేక సందర్భాల్లో నీటి నుంచి పాలను వేరుచేసినట్టే.. అవసరం తీరిన తర్వాత.. సినీమావాళ్లను కూడా రాజకీయ పార్టీలు పక్కన పెడుతున్నాయి. గతంలో వైసీపీకి పనిచేసిన పృథ్వీ, పోసాని కృష్ణమురళి, అలీ, మోహన్‌బాబు .. వంటివారిని అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆ పార్టీ పట్టించుకోలేదనే వాదన ఉంది. కనీసం.. తనకు నామినేటెడ్ పోస్టు అయినా.. ఇవ్వాలని ఒకరు అభ్యర్థించినా.. వైసీపీ పెద్దలు పక్కన పెట్టారనే టాక్ ఉంది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు సినీరంగంలో ప్రముఖులు.. ముఖ్యంగా రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారు.. ఒకింత జాగ్రత్త పడుతున్నా రు. ఇలాంటి వారిలో ఇప్పుడు దర్శకురాలు, నిర్మాత జీవితారాజశేఖర్ మరోసారి తెరమీదికి వచ్చారు. గతంలో ఈమె భర్త రాజశేఖర్‌తో కలిసి.. వైసీపీకి ప్రచారం చేశారు. అయితే..కొన్ని కారణాలతో పార్టీ నుంచి బయటకు వచ్చారు. వాస్తవానికి ఆదిలో కాంగ్రెస్‌లో చేరారు. తర్వాత.. జగన్‌కు జై కొట్టారు. కట్ చేస్తే.. ఇప్పుడు రాజకీయంగా ప్లాట్ ఫాం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలు.. జీవితపై దృష్టి పెట్టారు. మంచి వాగ్ధాటి.. గుక్కతిప్పుకోకుండా.. ప్రత్యర్థులపై విమర్శలు సంధించే లక్షణం ఉన్న జీవితను పార్టీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు.
ఎందుకంటే.. వచ్చే ఎన్నికల్లో గెలిచి..తెలంగాణలో అధికారంలోకి రావాలని.. బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో ఏపీలో మాదిరిగా తెలంగాణలోనూ సినీ రంగం రాజకీయాలను ప్రభావితం చేస్తుందనే అంచనాలపై బీజేపీ లెక్కలు వేస్తోంది. ఈ క్రమంలోనే జూనియర్‌తో పార్టీ అగ్రనేత.. అమిత్‌షా, నితిన్‌తో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాలు ఇటీవల భేటీ అయి చర్చించారు. ఈ చర్చల విషయాలు ఏంటో తెలియదు కానీ.. వారి శైలిని బట్టి.. సినీమా వాళ్లనుత మకు అనుకూలంగా మార్చుకునేందుకు ఇలా చర్చలు చేపట్టారనే చర్చ ఉంది. కట్ చేస్తే.. ఇప్పుడు జీవిత విషయం కూడా తెరమీదికి వచ్చింది.
అయితే.. జీవిత గత అనుభవాల నేపథ్యంలో బీజేపీ కి బలమైన కండిషన్ పెట్టారని తెలుస్తోంది. ముందుగానే ఏదైనా ఒప్పదం చేసుకోవటమే మంచిది అన్న అభిప్రాయంలో ఆమె ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో జీవిత... పార్టీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్‌కి ఓ కండిషన్ పెట్టారట. సంజయ్ పాదయాత్రలో పాల్గొనేందుకు, ప్రచారం చేసేందుకు తనకు అభ్యంతరం లేదన్న ఆమె.. అయితే.. ఇవన్నీ ఉత్తినే కుదరవని.. తేల్చి చెప్పిందట. బీజేపీ నుండి ఎక్కడయినా పోటీ చెయ్యడానికి రెడీ అని, అది ముందు ఖరారు చేేస్తే.. తాను వస్తానని లేకపోతే ఒక్క ప్రచారానికి అయితే రానని నిర్మోహమాటంమగా చెప్పినట్టు తెలిసింది. మరి దీనిపై సంజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.