Begin typing your search above and press return to search.
తెలంగాణా వైపు చూస్తారా ?
By: Tupaki Desk | 28 May 2021 11:30 AM GMTఅవటానికి తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడే అయినా చంద్రబాబునాయుడు నూరుశాతం ఏపికి మాత్రమే పరిమితమైంది వాస్తవం. దివంగత సీఎం వైఎస్సార్ మరణం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో తనకు ఎదురుండదని అనుకున్నారు. అయితే అనూహ్యంగా ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఊపందుకోవటంతో తప్పనిస్ధితిలో రాష్ట్ర విభజనకు అనుకూలంగా చంద్రబాబు లేఖలు ఇచ్చారు.
సమైక్య రాష్ట్రం రెండుగా విడిపోయినా టీడీపీకి వచ్చిన నష్టం ఏమీలేదని చంద్రబాబు అంచనా వేసుకున్నారు. అయితే రెండుచోట్లా అధికారంలోకి రావచ్చు లేకపోతే కనీసం ఏదో ఒక రాష్ట్రంలో అధికారంలో ఉంటామని అనుకున్నారు. అంచనా వేసినట్లే 2014లో జరిగిన రాష్ట్ర విభజన తర్వాత ఏపిలో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. తెలంగాణాలో కూడా 17 మంది ఎంఎల్ఏల గెలుపుతో టీడీపీ బలంగానే ఉంది.
అయితే 2015లో తెలంగాణా ఎంఎల్ఏ కోటాలో ఎంఎల్సీ ఎన్నికల్లో ఓటుకునోటు కేసు కారణంగా హైదరాబాద్ నుండి చంద్రబాబు విజయవాడకు మకాం మార్చేశారు. ఓటుకునోటు కేసులో తనను తెలంగాణా ప్రభుత్వం ఎక్కడ అరెస్టు చేయిస్తుందో అనే భయంతోనే అర్ధాంతరంగా హైదరాబాద్ ను వదిలేశారు. తర్వాత మెల్లిగా తెలంగాణా రాజకీయాలకు దూరమైపోయారు.
2018లో తెలంగాణా ముందస్తు ఎన్నికలు, తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికలు, తాజాగా జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ ఉనికే కోల్పోయింది వాస్తవం. నిజానికి ఇపుడు తెలంగాణాలో టీడీపీ ఉనికే లేదు. వాస్తవం ఇలాగుంటే మొదటిరోజు డిజిటల్ మహానాడులో పాల్గొన్న తెలంగాణా నేతలు చంద్రబాబును మళ్ళీ తెలంగాణా రాజకీయాల్లో యాక్టివ్ కావాలని కోరటం గమనార్హం.
తెలంగాణాలో కేసీయార్ మీద జనాల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేస్తోంది కాబట్టి అడ్వాంటేజ్ తీసుకోవాలని నేతలు చంద్రబాబుకు సూచించారు. తెలంగాణా ప్రజలు టీడీపీని మరచిపోలేకపోతున్నట్లు వారు చెప్పటమే విచిత్రం. నేతలు చెప్పిందే నిజమైతే ఎంపి ఎన్నికల్లో కానీ గ్రేటర్ ఎన్నికల్లో కానీ టీడీపీకి కనీసం డిపాజిట్ కూడా ఎందుకు రాలేదో సమాధానం చెప్పగలరా ? క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు అర్ధమన తర్వాత చంద్రబాబు తెలంగాణాలో పార్టీని పూర్తిగా వదిలిపెట్టేశారు. మరిపుడు తెలంగాణా నేతల సూచన ప్రకారం చంద్రబాబు మళ్ళీ తెలంగాణా రాజకీయాలవైపు చూస్తారా ?