Begin typing your search above and press return to search.

గ్రీష్మ‌కు వ‌సంతం.. చంద్ర‌బాబు అభ‌యం ఇచ్చిన‌ట్టేనా..?

By:  Tupaki Desk   |   30 Aug 2021 3:02 AM GMT
గ్రీష్మ‌కు వ‌సంతం.. చంద్ర‌బాబు అభ‌యం ఇచ్చిన‌ట్టేనా..?
X
టీడీపీ సీనియ‌ర్ నాయ‌కురాలు, ఉమ్మ‌డి రాష్ట్ర అసెంబ్లీ.. మాజీ స్పీక‌ర్ కావ‌లి ప్ర‌తిభా భార‌తి.. కుమార్తె.. గ్రీష్మకు.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నుంచి అభ‌యం ల‌భించిందా? ఆయ‌న క‌రుణించారా? అంటే.. ఔన నే అంటు న్నారు టీడీపీ నాయ‌కులు. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ప్ర‌తిభా భార‌తి.. టీడీపీలోనే కొన‌సాగు తున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ప్ర‌తిభా భార‌తి.. వివాద ర‌హితురాలిగా.. అవినీ తి ర‌హిత రాజ‌కీయాల‌కు కేరాఫ్‌గా మారారు. ముఖ్యంగా పార్టీ ప‌ట్ల విధేయ‌త‌ను ప్ర‌ద‌ర్శించే నాయ‌కుల్లో ఆమె ముందున్నారు.

ఈ క్ర‌మంలో 1999 ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ప్ర‌తిభా భార‌తికి చంద్ర‌బాబు స్పీక‌ర్‌గా అవ‌కాశం క‌ల్పించారు. దీంతో ఆమె అప్ప‌టి కాంగ్రెస్ నాయ‌కులు.. వైఎస్ రాజ‌శేఖ‌రెడ్డిని ముప్పు తిప్ప‌లు పెట్టార‌ని.. టీడీపీ నాయ‌కులు చెబుతారు. ఇక‌, రాష్ట్ర మంత్రిగా కూడా ఆమె ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే.. 2009, 2014 ఎన్నిక ల్లో శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప‌రాజ‌యం పాలైన త‌ర్వాత‌.. ప్ర‌తిభా భార‌తి.. అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో.. రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. ఇక‌, ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ హ‌యాంలో మంత్రిగా ప‌నిచేసిన‌.. కోండ్రు ముర‌ళీ మోహ‌న్‌.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

దీంతో అప్ప‌టి టికెట్‌ను చంద్ర‌బాబు ముర‌ళికి అప్ప‌గించారు. వాస్త‌వానికి ఈ విష‌యంతో ఈ టికెట్‌ను త‌మ కుమార్తెకు ఇవ్వాలంటూ.. ప్ర‌తిభా బార‌తి.. చంద్ర‌బాబుకు విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌తిభా భార‌తి త‌న‌య‌గా.. రాజ‌కీయ అరంగేట్రం చేసిన గ్రీష్మ‌.. కు అప్ప‌టి ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఎలాంటి అభ‌య‌మూ ఇవ్వ‌లేదు. అయిన‌ప్ప‌టికీ.. గ్రీష్మ ప‌ట్టువ‌ద‌ల‌కుండా.. పార్టీని ప‌ట్టుకునే ఉన్నారు. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో టికెట్ సంపాయించుకున్న మాజీ మంత్రి కోండ్రు అడ్ర‌స్ లేకుండా పోయారు. ఈ నేప‌థ్యంలోనే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గ్రీష్మ‌కు ఛాన్స్ ఇచ్చేందుకు.. చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్న‌ట్టు టీడీపీ నేత‌లు చెబుతున్నారు.

ఇటీవ‌ల గ్రీష్మ పుట్టిన రోజు వేడుక చేసుకుంది. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు ఆమెనుఉద్దేశించి తొలిసారి.. ట్విట్ట‌ర్ వేదిక‌గా.. ఆమెను అభినందించారు. ``తెలుగుదేశం పార్టీ యువ నాయకురాలు కావలి గ్రీష్మ కు పుట్టినరోజు శుభాశీస్సులు. యువతను, మహిళలను సంఘటిత పరచడానికి నీవు చేస్తున్న కృషి అభినందనీయం. నీవు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటూ, మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను`` అని పేర్కొన్నారు. మొత్తానికి ఈ ప‌రిణామం చూస్తే.. గ్రీష్మ‌కు చంద్ర‌బాబు ఛాన్స్ ఇస్తున్న‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.