Begin typing your search above and press return to search.
ఇప్పటికైనా చంద్రబాబు మారతారా?
By: Tupaki Desk | 6 Dec 2021 3:12 AM GMTకాలం ఎప్పుడూ ఒకేలా ఉండదన్నది సత్యం.ఎప్పటికప్పుడు మారే కాలానికి అనుగుణంగా పరిస్థితులు.. పరిణామాలు మారుతూ ఉంటాయి. కాల ప్రవాహంలో చోటుచేసుకునే మార్పులు ఎక్కువగా ప్రభావితం చేసే రంగం రాజకీయం. నడిచినంత కాలం బాగానే నడిచినా.. తేడా మొదలైన తర్వాత పరిస్థితులు ఇట్టే మారిపోతుంటాయి. గడిచిన రెండున్నరేళ్ల కాలంలో ఎవరెన్ని అన్నప్పటికీ.. ఏపీలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజాదరణ తప్పలేదు. ఆ మాటకు వస్తే.. సీఎం జగన్ కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా అదే పనిగా విపక్ష నేత చంద్రబాబు వేలెత్తి చూపిస్తూ.. తరచూ విమర్శలు చేయటాన్ని ఆ పార్టీ ఫాలోయర్స్ కు కూడా నచ్చలేదు.
ఎంతో రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు అదే పనిగా తప్పులు చేస్తున్నారని.. సీఎం చేసే తప్పుల్ని చంద్రబాబు అదే పనిగా ప్రస్తావించటం ద్వారా.. ప్రజలకు అర్థమయ్యే అవకాశాన్ని ఆయన మిస్ చేస్తున్నారన్న విమర్శ ఉంది. గతంలో ఎవరేం చెప్పినా.. సదరు నేతల మాటలకు ఒక విలువ ఉండేది. మారిన కాలంలో ఆ విలువ పోయి చాలా కాలమైంది. ఎవరు.. ఎవరి గురించి విమర్శ చేసినా.. వారు చేసిన విమర్శ మీద ఫోకస్ కంటే కూడా.. వేలెత్తి చూపించిన వాడి వేలు వెనుక ఏముందన్న విషయం మీదనే ఎక్కువ చర్చ జరుగుతోంది.
ఇలాంటి వేళ.. రోజువారీగా ప్రెస్ తో మాట్లాడి.. ఏపీ ప్రభుత్వం అలా చేస్తుంది.. ఇలా చేస్తుందన్న విమర్శలు.. ఆరోపణల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయాన్ని చంద్రబాబు ఎప్పటికి గ్రహిస్తారు. తాము నమ్మి.. అధికారాన్ని చేతికి ఇచ్చిన అధినాయకుడి మీద ప్రజల్లో నమ్మకం ఉంటుంది. అది సడలాలంటే.. సదరు అధినేత తనకు తాను తప్పులు చేయాలి.. వాటిని ప్రజలు గుర్తించాలి. కానీ.. అలాంటి అవకాశం ఇవ్వని చంద్రబాబు.. నిత్యం తానే జగన్ లోని తప్పుల్ని ఎత్తి చూపటం ద్వారా ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావాలన్నప్లాన్ ఏ మాత్రం వర్కువుట్ కాదన్న వాస్తవాన్ని ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది.
ఎందుకంటే.. ప్రజలకు ఏది మంచి? ఏది చెడు? అన్నది బాగా తెలుసు. కాకుంటే.. మంచి అని నమ్మటం కాస్త కష్టం. చెడును చాలా త్వరగా గుర్తిస్తారు.అయితే.. జగన్ విషయంలో ఇది కాస్తా రివర్సు అని చెప్పాలి. ఆయన్ను నెగిటివ్ గా దీర్ఘకాలం చూసిన ప్రజలు.. ఆయన మీద నమ్మకంతో అధికారాన్ని అప్పజెప్పటం ద్వారా తమకున్న సానుకూలత ఎంతన్నది ఎన్నికల ఫలితాల ద్వారా చెప్పేశారు. అలాంటి వేళలో.. జగన్ ఇమేజ్ డ్యామేజ్ చేయటానికి చంద్రబాబు ఎంత ఎక్కువ ప్రయత్నిస్తే.. అంతలా బౌన్స్ అవుతుందన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది.
చంద్రబాబుతో వచ్చే చిక్కేమిటంటే.. ప్రజలు ఒక అవగాహన రావటానికి ఆయన అవకాశం ఇవ్వరు. తాను అదే పనిగా చెప్పే మాటల్ని నమ్మాలని ఆయన కోరుతారు. ఒకసారి నమ్మకం సడలి.. వేరే వారికి అధికారం చేతికి ఇచ్చిన తర్వాత.. వారి మీద నమ్మకం సడలటానికి ప్రజలకు కాసింత స్పేస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
అదేమీ లేకుండా.. విమర్శల్ని అదే పనిగా అస్త్రాలుగా సంధించటం ద్వారా బాబుకు లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుంది.
ఎందుకిలా అంటే.. చంద్రబాబు ఇమేజ్ ను ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఎప్పుడో డ్యామేజ్ చేయటమే కాదు.. ఆయన మాటలకు విశ్వసనీయత మీద సందేహాల్ని వ్యక్తమయ్యేలా చేశారు.
ఇలాంటప్పుడు మాట్లాడే కన్నా.. మౌనంగా ఉంటూ తీర్పు కాలానికి వదిలేయటం అత్యుత్తమ పద్దతి. అలా చేయకుంటే.. కాలం ఆయనకు అనుకూలంగా మారే అవకాశం ఉండదన్న విషయాన్ని బాబు ఎప్పటికి అర్థం చేసుకుంటారో?