Begin typing your search above and press return to search.
చంద్రబాబు మాట తప్పుతాడా... ?
By: Tupaki Desk | 3 March 2022 9:41 AM GMTచంద్రబాబును ప్రాక్టికల్ పొలిటీషియన్ అని అంటారు. ఆయన ఏది చేసిన ఆ రోజు అవసరాలకు కట్టుబడి మాత్రమే చేస్తారు అని అంటారు. ఇందులో విమర్శగా చూడాలంటే కూడా చూడవచ్చు. కానీ చంద్రబాబు వాస్తవ వాది. ఆయన ఊహాలలో ఉండరు, రేపు ఏం జరుగుతుందో అని ఈ రోజు జరగాల్సిన దాన్ని చేయక మానరు. అవకాశం వస్తే మాట అనో, మరోటి అనో తీసుకోకుండా వెనక్కు పోరు. చంద్రబాబు లాంటి ఒక సాధారణ మైన వ్యక్తి ఈ రోజు జాతీయ స్థాయి నాయకుడిగా ఉన్నారన్నా, ఎన్టీయార్ లాంటి గ్లామరస్ ఫిగర్, బిగ్ షాట్ పెట్టిన టీడీపీని పాతికేళ్ళుగా తన ఆద్వర్యాన విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు అన్నా కూడా అది చంద్రబాబు ప్రాక్టికల్ గా చేసే పాలిటిక్స్ వల్లనే సాధ్యపడింది అని ఎవరైనా నమ్ముతారు.
ప్రాక్టికాలిటీలో మాట ఇవ్వడాలూ, శపధాలు చేయడాలూ పట్టింపులూ పంతాలు వంటి వాటికి అసలు చోటు ఉండదు. కానీ అంతటి చంద్రబాబు కూడాప్రాక్టికాలిటీకి దూరంగా వ్యవహరించిన కొన్ని సందర్భాలు ఉన్నాయి. వాటి వల్ల ఆయన లాభం కంటే నష్టాన్నే చవి చూశారు. అందుకే ఆయన ఎపుడూ తిరిగి అలాంటి పొరపాట్లు చేయలేదు కూడా. అయితే అనుకోకుండా జరిగిందా లేక తొందరపాటులో అన్నారా లేక ఒక పక్కా వ్యూహంతో వ్యవహరించారా అన్నది తెలియదు కానీ చంద్రబాబు అయితే ఇక సభకు రాం రాం అనేశారు గత అసెంబ్లీలో
ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ అని మంచి టైమింగు తో రైమింగ్ తో ఆయన ఘాటైన కామెంట్స్ చేశారు. ఈ సభలో నేను ఉండను, తిరిగి ముఖ్యమంత్రిగానే సభకు వస్తాను అని కూడా చంద్రబాబు ఆనాడు భీషణ ప్రతిన చేశారు. మరి చంద్రబాబు చేసిన భీషణ ప్రతిన తరువాత ఇపుడు బడ్జెట్ సమావేశాలకు తెర లేస్తోంది. సభ కూడా దాదాపుగా పదిహేను రోజులకు పైగా జరగనుంది. అనేక కీలకమైన బిల్లులు సభలో చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అలాంటి అతి ముఖ్యమైన బడ్జెట్ సమావేశాలకు చంద్రబాబు గైర్ హాజరు అవుతారా అన్నదే ఇపుడు చర్చ. నిజానికి నాడు చంద్రబాబు సభలో తన సతీమణికి తీరని అవమానం జరిగిందని చెప్పి బయటకు వచ్చారు. ఆ మీదట మీడియా ముందు ఆయన పెద్ద ఎత్తున ఏడ్చారు కూడా. అది జాతీయ స్థాయిలో చర్చకు కూడా ఆస్కారం ఇచ్చింది. చాలా మంది నాయకులు బాబుకు మద్దతు ప్రకటించారు కూడా.
చంద్రబాబు సైతం అలాంటి ఎమోషనల్ ఇష్యూని ముందు పెట్టుకుని రానున్న కాలంలో వైసీపీ సర్కార్ ని బదనాం చేయాలని మాస్టర్ ప్లాన్ వేశారు. అది ఇక మీదట కూడా చేసే వీలుంది. అయితే చంద్రబాబు కనుక అసెంబ్లీ సమావేశాలకు వెళ్తే మాత్రం తాను గతంలో చేసిన కామెంట్స్, కౌరవ సభ, సతీమణికి అవమానం వంటివి ఆయనే పూర్తిగా పక్కన పెట్టేసినట్లు అవుతుంది. ఒక విధంగా ఎమోషనల్ క్రియేట్ చేయడానికి బాబు ఇక మీదట వీటిని ప్రయోగించే చాన్స్ కూడా ఉండదు.
కానీ చంద్రబాబు అవసరం అయితే రేపటి బడ్జెట్ సమావేశాల వేళ అటు టీడీపీలో చాలా ఉంది. టీడీపీలో ఎంత మంది నాయకులు ఉన్నా చంద్రబాబు ఉంటేనే ఆ కధ వేరుగా ఉంటుంది. ఆయనను పక్కన పెడితే సభలో ఎవరు టీడీపీ తరఫున నాయకత్వం వహిస్తారు అన్నది ఒక చర్చ అయితే సమర్ధంగా విపక్ష స్థానంలో ఉంటూ వైసీపీని ఇరకాటంలో పెట్టే నేర్పు కూడా ఉండాలి. ఇక ఎన్ని చెప్పుకున్నా చంద్రబాబు ఉంటే ఉండే ఫోకస్ మిగిలిన వారు ఉంటే రాదు అన్నది నిజం.
ఇలా ఏ విధంగా చూసుకున్నా చంద్రబాబు సభకు వెళ్లాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి. మరి చంద్రబాబు సభకు వస్తారా. తమ్ముళ్ల కోరిక అయితే బాబు రావాలనే. అలా అయితే బాబు చేసిన భీషణ ప్రతిన సంగతేంటి, ఆయన చేసిన శపధం కధ ఏంటి. ఇవి కూడా పెద్ద ఎత్తున వచ్చే ప్రశ్నలే. మొత్తానికి చంద్రబాబు పూర్తి డైలామాలో ఉన్నారనే చెప్పాలి. ఆయన రాక కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఆయన మాత్రం శపధాన్ని తలచుకుని అసెంబ్లీ బయట ఉండిపోతారా. లేక లోపలికి వస్తారా చూడాలి. ఒక వేళ బాబు వస్తే మాట తప్పినట్లు అవుతుంది కదా. మరి కిం కర్తవ్యం. దీనికి జవాబు టీడీపీకి దొరకాలి. అది లాజిక్ కి అందేలా ఉండాలి. అదే జరిగితే బాబు సభలోకి రావచ్చు. ఆయన్ని బడ్జెట్ సమావేశాల్లో చూడవచ్చు.