Begin typing your search above and press return to search.

చిన‌బాబు పాద‌యాత్ర‌తో చంద్ర‌బాబు ద‌శ తిరిగేనా ?

By:  Tupaki Desk   |   21 April 2022 4:28 AM GMT
చిన‌బాబు పాద‌యాత్ర‌తో చంద్ర‌బాబు ద‌శ తిరిగేనా ?
X
ఎన్నిక‌ల‌కు చాలా దూరం ఉంది అని అనుకునేందుకు లేదు. ఎన్నిక‌ల‌లో త‌ల‌ప‌డేందుకు చాలా చేయాల్సి ఉంది అని మాత్ర‌మే ప్ర‌ధాన పార్టీలు అనుకోవాలి. ఆ విధంగా వాళ్లంతా సిద్ధం కావాలి. వాస్త‌వానికి విరుద్ధంగా ఉండే ప‌నులు చేయ‌కుండా ఉండాలి. ఆ విధంగా మంచి ఆలోచ‌నలు మ‌రియు నిర్ణ‌యాలు తీసుకోవాలి.

ఇదే ఇప్పుడు ప్ర‌ధాన సూత్రం కావాలి. ఇదే ఇప్పుడు ప్ర‌థ‌మ క‌ర్త‌వ్యం కావాలి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు పుట్టిన్రోజు నిన్న‌టి వేళ అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఎన్న‌డూ లేనంత ఉత్సాహభ‌రిత వాతావ‌ర‌ణంలో జ‌రిగింది.

ఆయ‌నను ప్రేమించే మ‌రియు అభిమానించే వారు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నార‌ని మ‌రోసారి నిరూప‌ణ అయింది. తెలుగు వారి ఆత్మ గౌర‌వానికి తిరుగులేని భ‌రోసా చంద్ర‌బాబు అని యువ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడుతో స‌హా ఎంద‌రో కీర్తించారు.

ఆయ‌న కోసం కుప్పంలో మూడు ల‌క్ష‌లు రూపాయ‌లు వెచ్చించి ఓ అభిమాని భారీ ఎత్తున అన్న‌దాన కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఎంతోమంది టెకీలు ఆన్ లైన్ లో చంద్ర‌బాబు కార‌ణంగానే తాము ఇవాళ ఐటీ రంగంలో నిల‌దొక్కుకున్నామ‌ని చెబుతూ, ఆ రోజు ఆయ‌న చేసిన స‌హాయాన్ని మ‌రువ‌లేం అని ప‌దే ప‌దే చెప్పారు. రాజకీయ విమ‌ర్శ‌ల‌కు అతీతంగా వైసీపీ వ‌ర్గాలు కూడా నిన్న‌టి వేళ ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపి, హుందాత‌నం చాటుకున్నాయి.

ఇక లోకేశ్ పాద‌యాత్ర ద‌గ్గ‌రికే వ‌ద్దాం.. ఎవ‌రు అవునన్నా కాదన్నా పాద‌యాత్ర‌లు అన్న‌వి మంచి ఫ‌లితాలే ఇస్తాయి. గ‌తంలో వైఎస్సార్ చేసిన పాద‌యాత్ర ఎంత‌టి ప్ర‌భంజ‌నం సృష్టించిందో తెలిసిందే ! కాంగ్రెస్ పార్టీకి జ‌వం, జీవం పోసిన ఆ..యాత్ర‌ను ఎన్న‌డికీ మ‌రువ‌లేం. త‌రువాత కాలంలో ష‌ర్మిల, ఆ త‌రువాత కాలంలో జ‌గ‌న్ కూడా పాద‌యాత్ర‌ల‌తోనే ప్ర‌భంజ‌నం సృష్టించారు. ఇప్పుడు లోకేశ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి పాద‌యాత్ర‌తోనే స‌మ‌స్య‌లు గుర్తించి, అధికారంలోకి వ‌స్తే తామేం చేస్తామో చెప్పాల్సిన త‌రుణం రానే వ‌చ్చింది.

సీమ వ‌ర‌కూ బాల‌య్య స‌పోర్ట్ ఉండ‌నే ఉంది. ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌లో బీసీల మద్దతు ఉండనే ఉంది. క్ష‌త్రియ నేత‌లూ వెన్నంటే రానున్నారు. ఇక ఉత్త‌రాంధ్ర వ‌ర‌కూ చాలా మంది యువ నాయ‌కులే ముందుండి లోకేశ్ యాత్ర‌ను స‌క్సెస్ చేయ‌డం ఖాయం. క‌నుక ఇప్ప‌టి నుంచే ఆయ‌న ఈ దిశ‌గా ఆలోచిస్తే మంచి ఫ‌లితాలు అందుకోవ‌డం త‌థ్యం.