Begin typing your search above and press return to search.
చంద్రబాబు ఆర్మీతో తిరుపతిలో గెలుస్తాడా?
By: Tupaki Desk | 28 March 2021 5:47 AM GMTరాబిన్ శర్మ వచ్చినా.. చంద్రబాబు ఆర్మీ వచ్చినా తిరుపతిలో వైసీపీని కొట్టే మగాడే లేడు అని సర్వేలు, వైసీపీ నేతలు ఘోషిస్తున్నారు. ఎందుకంటే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చూశాక ఆ పార్టీ తిరుపతిలో గెలుపు నల్లేరుపై నడకే. ఓడిపోతుందని ఎవరికీ కించత్ కూడా డౌట్ లేదు. మరి చంద్రబాబు ఆర్మీ, వ్యూహకర్త ఎంత ప్రయత్నించినా తిరుపతిలో వైసీపీ మెజారిటీని కాస్త తగ్గించడం తప్పితే పెద్దగా చేసేదేం లేదు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
తిరుపతి ఉపఎన్నిక ఇప్పుడు ఏపీలో పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. టీడీపీ, బీజేపీ-జనసేన కూటములకు ఇది ఇజ్జత్ కా సవాల్ గా మారింది. పంచాయతీ, మున్సిపోల్స్ లో తేలిపోయిన ఆ రెండు పార్టీలు ఇప్పుడు ఈ ఎన్నికను గెలుచుకోవాలని పట్టుదల ప్రదర్శిస్తున్నాయి.
ఇక వైసీపీ అధికారంలో ఉండడంతో బలంగా ఉంది. వలంటీర్లు,అధికారులు, మంత్రులు, మాందీమాగధులతోపాటు ప్రజలు కూడా అభివృద్ధి కోణంలోనే వైసీపీ వెంటే ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇప్పటికే చంద్రబాబు తన రాజకీయ వ్యూహకర్త రాబిన్ శర్మతోపాటు టీడీపీకి ఉన్న ‘సీబీఎన్ ఆర్మీ’ని కూడా తిరుపతి బరిలో దించాలని డిసైడ్ అయ్యారట.. జగన్ వ్యూహానికి ప్రతివ్యూహం చేయాలని భావించిన చంద్రబాబు.. సీబీఎన్ ఆర్మీని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారిలో కీలకమైన వారిని ఎంపిక చేసి తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో దించాడట.. 50 కుటుంబాలకు ఒక్కరు చొప్పున బాధ్యతలు అప్పగించాడట..
అయితే తిరుపతిలో వైసీపీ గెలుపు ఖాయం అని అందరికీ తెలుసు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఈ చంద్రబాబు ఆర్మీ ఎంత వరకు మెజారిటీ తగ్గిస్తుందనేది వేచిచూడాలి.. చూద్దాం.. మునుపటి కంటే ఎక్కువ మెజారిటీ కొట్టాలని వైసీపీ ప్రయత్నిస్తుండగా.. టీడీపీ ప్రయాస అంతా వైసీపీ మెజార్టీ తగ్గించేందుకే కానీ.. గెలుపు కోసం కాదు అని అంటున్నారు.